తమిళ ఇండస్ట్రీలో ఫ్రూవ్ చేసుకుంటేనే కానీ తెలుగమ్మాయికి టాలీవుడ్‌లో సరైన గుర్తింపు దక్కడం లేదా అంటే.. సమ్ టైమ్స్ నిజమే అనిపించకమానదు. అంజలి, శ్రీదివ్య నుండి ఆనంది, ఐశ్వర్య రాజేష్ వరకు మాత్రమే కాదు.. ఇప్పుడు ఈ పదాహరణాల తెలుగు ఆడపడుచు శ్రీగౌరి ప్రియ ఈ కోవలోకే వస్తుంది. మ్యాడ్ కన్నా ముందు అరడజనుకు పైగా చిత్రాల్లో నటించినా ఐడెంటిటీ రాలేదు కానీ ఎప్పుడైతే ట్రూ లవర్‌తో రిజిస్టర్ అయ్యిందో మేడమ్ ఫేట్ మారిపోయింది. Also Read…
True Lover: తమిళంలో హీరోగా కొన్ని సినిమాలు చేసిన మణికందన్ గుడ్ నైట్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాడు. ఓటిటీలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని తెలుగువారికి మణికందన్ ను పరిచయం చేసింది. ఇక ఈ గుర్తింపుతో మణికందన్ తెలుగులో సత్తా చాటడానికి సిద్దమయ్యాడు.
True Lover Trailer: మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా ట్రూ లవర్. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు.