True Lover Movie to Release on 10th Febraury: ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ కి దాదాపు సిద్ధమయ్యాయి. అయితే థియేటర్లు సర్దుబాటు కష్టమని భావించి ఫిలిం ఛాంబర్ తో కలిసి నిర్మాతల మండలి ఏదో ఒక సినిమా అయినా వాయిదా వేసుకోమని కోరాయి. రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా నిర్మాతలు అయిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్, వివేక్ తాము వెనక్కి తగ్గుతామని ఫిలిం ఛాంబర్ ఆఫర్ తీసుకున్నారు. ఫిలిం ఛాంబర్ ఇచ్చిన హామీ మేరకు ఫిబ్రవరి 9వ తేదీన మరే ఇతర తెలుగు సినిమా రిలీజ్ కాకూడదు. అయితే ముందు ఊరి పేరు భైరవకోన సినిమా కూడా అదే రోజు రావడానికి ప్రణాళిక రెడీ చేసుకున్నా సరే ఫిలిం ఛాంబర్ చర్చలు జరిపి ఆ సినిమాని వెనక్కి వెళ్లేలా చేసింది. అయితే రవితేజ సినిమాతో పాటు రజనీకాంత్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన లాల్ సలాం సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా రిలీజ్ అవుతోంది.
Chiranjeevi : చిరంజీవిని సత్కరించనున్న తెలంగాణ సీఎం
ఇక ముందు నుంచి లేకుండా సడన్ గా తమిళంలో లవర్ పేరుతో రిలీజ్ అవుతున్న సినిమాని అదే 9వ తేదీన రిలీజ్ చేయడానికి మారుతీతో పాటు ఎస్కేఎన్ సిద్ధమయ్యాడు. తెలుగులో ట్రూ లవర్ పేరుతో ఫిబ్రవరి 9వ తేదీన మణికందన్, గౌరీ ప్రియ జంటగా నటించిన సినిమాని తీసుకురావాలనుకున్నారు. అయితే ఫిలిం ఛాంబర్ పెద్దలు రంగంలోకి దిగారో లేక ఎందుకు వచ్చిన దియేటర్ల టెన్షన్ అనుకున్నారో తెలియదు కానీ ఆ సినిమాని ఒక రోజు వెనక్కి వాయిదా వేసి ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో పైకి చెప్పక పోయినా ఈగల్ సినిమాకి మరికొంత ఊరట లభించినట్లు అయింది. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఫిబ్రవరి ఏడవ తేదీన కెమెరామెన్ గంగతో రాంబాబు రిలీజ్, 8వ తేదీన యాత్ర 2 రిలీజ్, 9వ తేదీన ఈగల్ సినిమాతో పాటు లాల్ సలాం తెలుగు డబ్బింగ్ రిలీజ్ అవుతున్నాయి. ఇక పదో తేదీన ట్రూ లవర్ సినిమా రిలీజ్ అవుతోంది.. మొత్తం మీద పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారికి ఈగల్ సినిమాల విషయంలో ఎంతో కొంత టెన్షన్ అయితే క్లియర్ అయినట్లు చెప్పవచ్చు