ప్రపంచం విజయవాడ వైపు చూడాలనే ఈ ఉత్సవ్!
2025 దసరా సందర్భంగా ‘సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ’ సారథ్యంలో ఏపీ ప్రభుత్వ సహకారంతో ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ‘విజయవాడ ఉత్సవ్’ పేరుతో కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంకు హీరోయిన్ సంయుక్త మీనన్ హాజరయ్యారు. ‘విజయవాడ అందమైన సిటీ. విరూపాక్ష సినిమా రిలీజ్ ముందు అమ్మవారి దర్శనం చేసుకున్నాను. విజయవాడ ఉత్సవ్ ఒక విజన్‌తో చేస్తున్నారు. ప్రజలందరి మద్దతుతోనే విజయవాడ ఉత్సవ్ సక్సెస్ అవుతుంది. సెప్టెంబరు 22 నుంచి అక్టోబర్ 2 వరకూ జరిగే విజయవాడ ఉత్సవ్‌లో చాలా కార్యక్రమాలు జరుగుతాయి. పర్యాటకాన్ని ప్రొమోట్ చేస్తూ.. ప్రపంచం విజయవాడ వైపు చూడాలని ఈ ఉత్సవ్ నిర్వహిస్తున్నారు’ అని సంయుక్త చెప్పారు.
ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన రూ. 581 కోట్లు వసూలు చేసిన సినిమా
బాలీవుడ్ లో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సైయారా. ఆహాన్ పాండే, అనీత్ పద్ద లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. రిలీజ్ కు ముందు ఎటువంటి అంచనాలు లేని సైయారా రిలీజ్ తర్వాత సంచనలం సృష్టించింది. సినిమాలో ఉండే లవ్ సింప్లిసిటీ, ఎమోషనల్ టచ్, మ్యూజికల్ మ్యాజిక్ ఆడియెన్స్‌ను బలంగా టచ్ చేశాయి. ఆషికి 2, ఎక్ విలన్, ఆవరాపన్, లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్‌లు అందుకున్న దర్శకుడు మోహిత్ సూరి తెరకెక్కించిన సైయారా తో ఆహాన్ పాండే, అనిత్ పడ్డా ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు.
ముందస్తు ఏర్పాట్లు, బందోబస్తు, డ్రోన్ల వినియోగం.. ప్రశాతంగా నిమజ్జనం!
శనివారం ఉదయం 6:30 గంటల నుండి హైదరాబాద్ లో గణేష్ శోభయాత్రలు ప్రారంభం అయ్యాయి. ఈ శోభయాత్ర మొత్తం 40 గంటల పాటు నుండి కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్ సీపీ CV ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 12,034 విగ్రహాలకు ఆన్లైన్ లో ముందుగా పెర్మిషన్ ఇవ్వగా, ఇప్పటివరకు 6,300 విగ్రహాలు నిమజ్జనం పూర్తయ్యాయి. అదనంగా, 1 లక్షా 40 వేల విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లు తెలిపారు. చిన్న విగ్రహాలను కలిపి ఇంకా 25 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.
ఎలాంటి వారికి గవర్నర్ పదవి.. అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలపై బొత్స సీరియస్!
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు. రుషికొండ రిసార్ట్స్ ను మెంటల్ హాస్పిటల్ చేయాలన్న వ్యాఖ్యలపై బొత్స ఫైర్ అయ్యారు. అశోక్ వ్యాఖ్యలు అహంకారం, అహంభావానికి నిదర్శనం అని మండిపడ్డారు. అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి నిదర్శనం అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎటువంటి వారికి గవర్నర్ పదవి ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు అని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ప్రజాధనంతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ను పిచ్చి ఆసుపత్రిగా మార్చాలని గోవా గవర్నర్ అశోక్‌గజపతి రాజు సలహా ఇచ్చారు. క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో బుధవారం విశాఖలో సన్మాన సభ ఏర్పాటు చేయగా.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
హన్మకొండలో రైతుల కోసం పాదయాత్ర.. ఎర్రబెల్లి హాట్ కామెంట్స్
హన్మకొండ జిల్లా అయినవోలు మండలం వెంకటాపురం గ్రామం నుండి స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రైతుల కోసం పాదయాత్రను ప్రారంభించారు. వెంకటాపురం నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర నష్కల్ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసలు పడుతున్నారు.
పేద ప్రజలంటే సీఎం చంద్రబాబుకు అలుసా?.. ప్రైవేటీకరణ రద్దు చేస్తాం!
మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణం అని మాజీ డిప్యూటీ సీఎం, పీఏసీ సభ్యుడు అంజద్ భాష పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. పేద ప్రజలంటే సీఎం చంద్రబాబుకు అంత అలుసా? అని ప్రశ్నించారు. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ రద్దు చేస్తాం అని చెప్పారు. వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని, ఆ డబ్బును ప్రభుత్వ ఆస్పత్రులకు కేటాయించవచ్చు కదా? అని అంజద్ భాష ఫైర్ అయ్యారు. కడపలో అయన ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు.
బర్త్ డే సెలబ్రేట్ చేస్తామని చెప్పి, మహిళపై దారుణం..
బర్త్ డే సెలబ్రేట్ చేస్తామని నమ్మించి, ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం రోజు కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. ఇద్దరు తెలిసిన వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు హరిదేశ్ పూర్‌కు చెందిన 20 ఏళ్ల మహిళ ఆరోపించింది. చందన్ మల్లిక్, ద్వీప్ బిశ్వాస్‌గా గుర్తించబడిన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధిత మహిళతో నిందితుడు చందన్ మల్లిక్‌తో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. దక్షిణ కోల్‌కతా పూజా కమిటీ అధిపతి అని చెప్పుకున్న మల్లిక్, ఆ తర్వాత ఆమెను దీప్‌కు పరిచయం చేశాడు. ఇద్దరూ కూడా కమిటీలో ఆమెకు ప్రాధాన్యత ఇస్తామనే హామీ ఇచ్చారు. ముగ్గురూ కూడా తరుచుగా మాట్లాడుకునే వారు. సంఘటన జరిగిన రాత్రి, నిందితుడు, మహిళను రీజెంట్ పార్క్ ప్రాంతంలో ఓ ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు, అక్కడే వారు భోజనం చేశారు. ఆమె ఇంటికి వెళ్లడానికి ప్రయత్నం చేసినప్పుడు, వారు ఆమెను గదిలోనే బంధించి, అత్యాచారం చేసినట్లు మహిళ ఆరోపించింది. తర్వాతి రోజు ఉదయం ఆమె తప్పించుకుని ఇంటికి తిరిగి వచ్చింది. బాధితురాలు హరిదేశ్ పూర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు సాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణం.. వైసీపీ చేసినవి అసత్య ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నిర్మించే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మంత్రి కందుల దుర్గేష్ ఖండించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై చేస్తున్నవి అసత్య ఆరోపణలు అన్నారు. పీపీపీ విధానం ద్వారా నిర్మాణాల్లో వేగం పెరుగుతుంది.. నిర్మాణం పూర్తైన అనంతరం కాలేజీలపై నియంత్రణ, యాజమాన్య హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది.. తద్వారా వైద్య విద్య ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తుంది అన్నారు. పీపీపీ విధానంలో నిర్మిస్తున్న కొత్త మెడికల్ కాలేజీలతో పాటు ప్రతి మెడికల్ కాలేజీలో కనీసం 150 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరిగే ఆవకాశం ఉందన్నారు. వాస్తవాలను పక్కన పెట్టి రూ.8,500 కోట్ల విలువైన కాలేజీలను రూ.5,000 కోట్లకు బినామీలకు లీజుకు ఇస్తున్నారని వక్రీకరణ చేస్తున్నారు అని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.
కామారెడ్డి బీసీ సభతో రాష్ట్ర రాజకీయాలకు మలుపు
కామారెడ్డి జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సభ ఘనంగా జరిగింది. ఈ సభ బీజేపీకి కనువిప్పు కలిగించేలా, రాష్ట్ర రాజకీయాలకు మలుపు తిప్పేలా నిలుస్తుందని బీజేపీ నేత మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల బారిన పడింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో భారీ దోపిడి జరిగింది. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత స్వయంగా ఒప్పుకోవడం చాలా ఆశ్చర్యకరం. వాటా లో తేడా కారణంగానే కవిత నిజం చెబుతున్నట్లు అర్థమవుతోంది” అన్నారు.