Tollywood Young Director heading towards divorce: సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు ప్రేమ పెళ్లిళ్లు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకోవడం ఆ తర్వాత కొంతకాలానికే విడాకుల వరకు వెళ్లడం పరిపాటిగా మారిపోయింది. ఈ ఏడాది మెగా డాటర్ నిహారిక తాను వివాహం చేసుకున్న చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మరో హీరోయిన్ అయిన కలర్స్ స్వాతి కూడా విడాకులు తీసుకునే అవకాశం ఉందని వార్త తెరమీదకు వచ్చింది. ఆ విషయం మీద ఆమె ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ త్వరలోనే విడాకులు తీసుకోవడం ఖాయమని ప్రచారం మాత్రం జరిగింది. ఇప్పుడు ఆ సంగతి పక్కన పెడితే ఒక టాలీవుడ్ జంట విడాకులకు సిద్ధమవుతుందని ఫిలింనగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి ఆయన ఒక యంగ్ డైరెక్టర్, గట్టిగా పది సినిమాలు చేయకపోయినా సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి సినిమాలు చేస్తాడని పేరు తెచ్చుకున్నాడు.
Rajamouli: మొన్న మెగాస్టార్..ఇప్పుడు మెగా డైరెక్టర్.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’కి ఫిదా!
ఈ ఏడాది మొదట్లో స్టార్ హీరోతో సినిమా చేసి డీసెంట్ హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత కొన్ని రోజులకే వివాహం చేసుకున్నాడు. ఆ సినిమా రిజల్ట్ ఇచ్చిన బూస్ట్ తో మరొక క్రేజీ ప్రాజెక్టు కూడా పట్టాలెక్కించే పనిలో ఉన్న ఆయన పర్సనల్ లైఫ్ లో మాత్రం పెద్ద కుదుపు ఏర్పడిందని తెలుస్తోంది. ఎంతో ప్రేమగా వివాహం చేసుకున్న వారి వివాహ బంధానికి ఇప్పుడు బీటలు వారినట్టు ప్రచారం జరుగుతోంది. కొన్ని విషయాలలో భార్య-భర్తలు ఇద్దరి మధ్య దూరం పెరగడంతో ఆ దూరం విడాకుల వరకు దారి తీసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విడాకుల కోసం అప్లై చేసినా ఈ లీగల్ ప్రొసీజర్ అంతా పూర్తి అయ్యేందుకు మరికొంత కాలం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఒకపక్క నడుస్తున్నా ఆయన మాత్రం తన తదుపరి సినిమా కోసం ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా పర్సనల్ లైఫ్ సెట్ చేసుకొని ప్రొఫెషనల్ లైఫ్ మీద దృష్టి పూర్తిస్థాయిలో కేంద్రీకరించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.