Maverick SS Rajamouli praises Team Miss Shetty Mr Polishetty : యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. శుక్రవారం నాడు జవాన్ సినిమాతో పాటు పాన్ ఇండియా స్థాయిలో దక్షిణాది భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చూసిన వారందరూ కామెంట్ చేస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాకు కేవలం ఆడియన్స్ నుంచే కాదు సెలబ్రిటీల అప్రిసియేషన్లు సైతం దక్కుతున్నాయి. సినిమా సూపర్ హిట్ అవుతుందని రిలీజ్ ముందు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసి రివ్యూ సైతం ఇవ్వగా ఇప్పుడు తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.
Bhagavanth Kesari: భగవంత్ కేసరిలో బాలయ్య ధరించిన డ్రెస్సులు కావాలా? ఇలా చేయండి!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చూసి దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్ చేసి తన రివ్యూ ఇచ్చేశారు. స్వీటీ అనుష్క, ఎప్పటిలాగే అందంగా తెరపై మెరిసింది, నవీన్ పోలిశెట్టి తన నటనతో సరదా పంచుతూ నవ్వులు పూయించాడు, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో సక్సెస్ అందుకున్న టీమ్ మెంబర్స్ అందరికీ కంగ్రాట్స్, సెన్సిటివ్ అంశాన్ని నేపథ్యంగా ఎంచుకుని ఇంత ఫన్ తో సినిమా రూపొందించిన దర్శకుడు పి.మహేశ్ బాబు కు అభినందనలు అని ఆయన తన రాసుకొచ్చారు రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మాణంలో దర్శకుడు మహేష్ బాబు.పి తెరకెక్కించారు. నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టితో కలిసి అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి తదితరులు సినిమాలో నటించారు.