Tollywood Movies talk Released this week: ఈ వారం పెద్ద సినిమాలేవి రిలీజ్ కి లేకపోవడంతో దాదాపుగా 6 నుంచి 7 వరకు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ వారంలో ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. ఒక్కొక్క సినిమాలో కొన్ని కొన్ని మైనస్ పాయింట్ లు ఉండడంతో పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సినిమా ఒక్కటి కూడా రాలేదని చెప్పచ్చు. ఈ వారం విడుదలైన సినిమాలలో రెండు సినిమాల మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. నాగశౌర్య హీరోగా యుక్తితరేజా హీరోయిన్గా నటించిన రంగబలి సినిమాతో పాటు శ్రీ సింహ కోడూరి, నేహా సోలంకి జంటగా నటించిన భాగ్ సాలే సినిమాల మీద ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.
Bedurulanka 2012: ఆగస్టు 25న కార్తికేయ, నేహా శెట్టిల ‘బెదురులంక 2012’
కానీ ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యాయి. ఇక ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా జగపతిబాబు, విమల రామన్, మమతా మోహన్దాస్ ప్రధాన పాత్రలలో నటించిన తెలంగాణలో గడీల నేపథ్యంలో పీరియాడిక్ మూవీ రుద్రంగి, సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ 7:11 PM సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలు కూడా పూర్తిస్థాయిలో ప్రేక్షకులు ఆకట్టుకోలేకపోయాయి. ఇవి కాకుండా డైరెక్టర్ నీలకంఠ దర్శకత్వంలో సర్కిల్ అనే సినిమా, విజయేంద్ర ప్రసాద్ శిష్యురాలు దివ్య భావన దర్శకత్వంలో ఓ సాథియా అనే సినిమాలు కూడా ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పూర్తిస్థాయిలో పిల్లలను ప్రధాన పాత్రధారులుగా పెట్టి తెరకెక్కించిన లిల్లీ అనే పాన్ ఇండియా మూవీ కూడా రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.