Bedurulanka 2012: ఆగస్టు 25న కార్తికేయ, నేహా శెట్టిల ‘బెదురులంక 2012’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Bedurulanka 2012’ will release on august 25th: కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన తాజా సినిమా ‘బెదురు లంక 2012’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు సి.యువరాజ్ చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన ‘బెదురులంక 2012’ సినిమాను ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఈ రోజు వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ ”అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది, కొత్త కంటెంట్, బ్యూటిఫుల్ విజువల్స్, మంచి పాటలతో మేం ‘బెదురులంక 2012’ తీశామని అన్నారు. ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి ఈ సినిమా తీసుకు వెళుతుంది, ఇప్పటివరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా ఉంటుంది, గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా అంటే ‘బెదురులంక 2012’ ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది” అన్నారు.
Jawan: మెంటలెక్కిస్తున్న జవాన్ క్రేజ్.. ట్రైలర్ రిలీజ్ కాకుండానే అన్ని కోట్లా?
Also Read
దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ”ఇప్పటికే విడుదలైన టీజర్, పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని ప్రేక్షకులు అందరూ సినిమా విడుదల ఎప్పుడు? ఎప్పుడు? అని అడుగుతున్నారని అన్నారు.. ఆగస్టు 25న ‘బెదురులంక 2012’ ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపిస్తామని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయని, త్వరలో ట్రైలర్ విడుదల తేదీ వెల్లడించడంతో పాటు మిగతా పాటలను విడుదల చేస్తామని అన్నారు. మణిశర్మ గారు అద్భుతమైన బాణీలు అందించారు. పాటల్లోనూ, సన్నివేశాల్లోనూ కార్తికేయ, నేహా జోడీ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది” అని ఆయన అన్నారు. కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని కీలక పాత్రలలో నటించారు.
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!