బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక నిర్మాతగా, హోస్ట్ గా, బిజినెస్ మ్యాన్ గా ఆయనకు రిమార్క్ లేదు.. అయితే వ్యక్తిగతంగా మాత్రం కరణ్ ఎన్నో నిందలను ఎదుర్కొంటున్నాడు. మొదటి నుంచి కరణ్ గే అని, ఎంతోమంది బాలీవుడ్ హీరోలతో కరణ్ కు సంబంధం ఉందని ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా షారుఖ్ ఖాన్ తో ఎన్నో ఏళ్ళనుంచి కరణ్ రిలేషన్ లో ఉన్నాడని, అతడితో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నాడని బాలీవుడ్ కోడై కూస్తోంది. అయితే ఇలాంటి జీర్ణించుకోలేని నిందలకు కరణ్.. తన బుక్ తో సమాధానం చెప్పాడు. అందులో తన జీవితంలో మిగిలిపోయిన చాఫ్టర్లు ను అభిమానులకు పరిచయం చేశాడు. ఇటీవలే కరణ్ జోహార్ తన జీవితాన్ని ‘యాన్ అన్ సూటబుల్ బాయ్’ పేరుతో ఒక పుస్తకంగా మలిచాడు. అందులో షారుఖ్ తో ఎఫైర్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
“నేను జీవితంలో ఎన్నో నిందలు భరించాను.. కానీ ఏది నన్ను ఇంత బాధ పెట్టలేదు. షారుఖ్ ఖాన్ తో కరణ్ పడుకున్నాడు అని వార్తలు విన్నప్పుడు నా గుండె పగిలిపోయింది. ఒక షో లో యాంకర్ ఆ ప్రశ్నను నా ముఖం మీదే అడిగేశాడు. ఆ వార్త నన్ను ఎంతో బాధించింది. షారుఖ్ నాకు తండ్రిలాంటి వాడు.. ఒక అన్నలా నన్ను ఓదార్చేవాడు. అతడితో పడక సుఖాన్ని కోరుకుంటున్నాను అని ఎలా అనుకున్నారు. ఈ రోజుల్లో శృంగారంలో పాల్గొనడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. నేను శృంగారంలో పాల్గొనాలి అంటే అది మానసికంగా నేను రెడీ గా ఉండాలి. అది క్యాజువల్ గా చేసే ప్రక్రియ కాదు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు చాలా కోపం వచ్చింది.. నీ అన్నతో నువ్వు పడుకుంటావా ..? అని నేను అడిగితే నీకెలా ఉంటుంది అని అడిగేశాను. షారుఖ్ ను, నన్ను ఆ విధంగా చూడడం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. ఒక వ్యక్తి తన జీవితంలో మహిళతో సంబంధం పెట్టుకోకపోతే అతడు గే అని అనేస్తారా..? ఇది ఎంతవరకు కరెక్ట్..? ” అని తన ఆవేదనను వెళ్లగక్కాడు. ప్రస్తుతం కరణ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.