విశాల్ హీరోగా ఎ. వినోద్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘లాఠీ’. ఈ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. నిర్మాణంలో ఉన్న భవనం ముందు సాలిడ్ గా నిలబడి, ఒక చేతిలో లాఠీ పట్టుకుని, మరో చేతికి బ్యాండేజీ కట్టుతో ఈ ఫస్ట్ లుక్ లో విశాల్ కనిపించాడు. శరీరమంతా గాయాలతో పాటు భవనం నుండి లేజర్ కిరణాలు విశాల్ పై పడటం కూడా ఈ యాక్షన్ పోస్టర్ లో గమనించవచ్చు.
విశేషం ఏమంటే.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను 50 అడుగుల వినైల్ తో తయారుచేసి హైదరాబాద్ లోని ప్రసాద్స్ ఐమాక్స్ లోనూ, వైజాగ్ సీఎంఆర్ మాల్ లోనూ ప్రదర్శిస్తున్నారు. దాంతో ఇక్కడ ప్రసాద్స్ కు, అక్కడ షాపింగ్ మాల్ కు వచ్చిన జనాలు ఈ భారీ వినైల్ ముందు సెల్ఫీలు దిగి సందడి చేస్తున్నారు. విశాల్ సరసన సునైనా నటిస్తున్న ఈ చిత్రాన్ని రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలసుబ్రమణ్యన్ ఛాయాగ్రహకుడిగా, సామ్ సిఎస్ సంగీత దర్శకుడిగా, పొన్ పార్థిబన్ రచయితగా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
50ft banners of @VishalKOfficial’s #Laatti At Prasads Hyderabad & CMR mall Vizag @VishalKOfficial @actorramanaa @nandaa_actor @dir_vinothkumar @PeterHeinOffl @thisisysr @TheSunainaa #BalasubramaniemDop @DOP_bala @skannanartdir @srikanth_nb @vasukibhaskar @HariKr_official pic.twitter.com/eBTErgJTJe
— Rana Productions (@_RanaProduction) April 11, 2022