విజయ్ దేవరకొండ,సమంత జంట గా తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ సినిమా ‘ఖుషి’.విజయ్ దేవరకొండ,సమంత ఇద్దరు కూడా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు.విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తో, సమంత శాకుంతలం సినిమా తో భారీ ప్లాప్ లను అందుకున్న సంగతి తెలిసిందే..విపరీతమై న బడ్జెట్ తో ఓవర్ పబ్లిసిటీ తో విజయ్ నటించిన లైగర్ సినిమా విడుదలైంది. ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. ఆ సినిమా విజయ్ కెరీర్ కు పెద్ద దెబ్బ తగిలింది. సమంత వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల ను ట్రై చేసింది. తాను చేసిన శాకుంతలం భారీ డిజాస్టర్ గా నిలిచింది. వీరిద్దరికీ అదిరిపోయే హిట్ కావాలి.అందుకే ఈ ఇద్దరు కూడా ఇప్పుడు కలిసి నటిస్తున్న ఖుషి సినిమా మీదనే భారీ ఆశలు పెట్టుకున్నారు.
శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అంచనాలు కూడా బాగానే వున్నాయి.. సమంత, విజయ్ కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా షూట్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టు కుంటుంది.. ఫస్ట్ సింగల్ చార్ట్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.. ఇక ఈ సినిమా నుండి ఇప్పుడు మరో అప్డేట్ బాగా వైరల్ అవుతుంది.. ఈ సినిమా ఓటిటి బిజినెస్ జరిగింది అని సమాచారం… తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటిటి డీల్ ను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ ప్రైమ్ వీడియో లో ఉంటుందని సమాచారం.. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 1 న విడుదల కాబోతున్నట్లు సమాచారం.ఈ సినిమా కు హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం.. మైత్రి మూవీ మేకర్స్ భారీ రేంజ్ లో ఈ సినిమా ను నిర్మిస్తుంది