దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘లియో’. విక్రమ్ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న లోకేష్, తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి బయటకి వచ్చి స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గా చేస్తున్న సినిమా ‘లియో’. మాస్టర్ సినిమాతో హిట్ మిస్ అయిన విజయ్-లోకేష్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ అక్టోబర్ 19న ఈ సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకోని రావడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న లియో మూవీ నుంచి బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ బయటకి వచ్చి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. స్టైలిష్ పోస్టర్స్ ని కొత్తగా డిజైన్ చేసి వదులుతున్న లోకేష్… లియో సినిమాపై అంచనాలు పెంచుతూనే ఉన్నాడు. విజయ్ లుక్ విషయంలో కొన్ని నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి కానీ లోకేష్ తన సినిమాటిక్ బ్రిలియన్స్ తో ఆ నెగటివ్ కామెట్స్ వినిపించకుండా చేస్తాడనే నమ్మకం అందరిలోనూ ఉంది. ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుపుకుంటున్న లియో మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ మూవీ రన్ టైమ్ లాక్ అయ్యిందని సమాచారం.
లోకేష్ లియో సినిమాని రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నిడివితో లాక్ చేసాడట. ఒక స్టార్ హీరో కమర్షియల్ సినిమాకి రెగ్యులర్ గా ఉండే నిడివితోనే లియో కూడా ఉంది కాబట్టి థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి లాగ్ అనిపించే అవకాశం లేదు. దాదాపు రెండున్నర గంటల పాటు ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ సినిమాని లోకేష్ చూపిస్తూ, పర్ఫెక్ట్ హై మొమెంట్స్ ని మైంటైన్ చేస్తే చాలు లియో విజయ్ కెరీర్ లోనే కాదు కోలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వడం గ్యారెంటీ. లియో సినిమా కోలీవుడ్ లో హిట్ అవుతుంది కానీ ఇతర భాషల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా ఉంది. కన్నడ నుంచి శివన్న, తెలుగు నుంచి బాలయ్య అండ్ రవితేజ, హిందీ నుంచి అమితాబ్ అండ్ టైగర్ ష్రాఫ్ లు విజయ్ కి పోటీగా వస్తున్నారు. వీళ్లని వాళ్ల ఇండస్ట్రీల్లో దాటి హిట్ కొట్టడం అంత ఈజీ విషయం కాదు, ఇలాంటి సమయంలో లియో పాన్ ఇండియా హిట్ అవ్వాలి అంటే అద్భుతమే జరగాలి. మరి లోకేష్ అండ్ విజయ్ లియో సినిమాతో ఏం చేస్తారో చూడాలి.