లియో బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ అయ్యి వారం కూడా కాలేదు అప్పుడే సోషల్ మీడియాలో లియో 2 డిస్కషన్స్ స్టార్ట్ అయిపోయాయి. లియో 2లో ఫ్లాష్ బ్యాక్ పైన ఫుల్ కథ ఉంటుంది, పార్తీబన్ గా ఎలా మారాడో చూపిస్తారు? లియో దాస్ ఫ్యాక్టరీలో నుంచి మంటల్ని దాటి ఎలా ప్రాణాలు కాపాడుకున్నాడు అనే విషయాలని చూపిస్తూ పార్ట్ 2ఉంటుందని కొత్త ఫ్యాన్ థియరీస్ బయటకి వచ్చాయి. ఈ థియరీస్ దెబ్బకి లియో 2 ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయినా ఓపెన్ ఎండ్ ఇచ్చేస్తే లోకేష్ పార్ట్ 2 తీయడానికి రెడీ అయినట్లు కాదు. లోకేష్ సినిమాలని ఫాలో అవుతూ వచ్చిన వాళ్లకి ఇదేమి కొత్త విషయంలా అనిపించదు. ఎందుకంటే తన మొదటి సినిమా నగరం నుంచి ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాల వరకు ప్రతి మూవీలో లోకేష్ కనగరాజ్ ఓపెనింగ్ ఎండింగే ఇచ్చాడు. పార్ట్ 2కి అవసరమైన లీడ్ ఇచ్చి సినిమాకి ఎండ్ కార్డ్ వేయడం లోకేష్ స్టైల్, అదే లియో కూడా ఫాలో అయ్యాడు. అంతే కానీ స్పెషల్ గా లియో సినిమాకి మాత్రమే లోకేష్ ఓపెనింగ్ ఎండింగ్ ఇవ్వడం అనేదేమి లేదు. ఎప్పటికైనా ఉపయోగ పడుతుంది అని లోకేష్ అలా ఎండింగ్ ని వదిలేస్తాడు.
ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే… లోకేష్ నేను చేసేదే పది సినిమాలు అని క్లియర్ గా చెప్పేసాడు. నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో సినిమాతో కలిపి అయిదు అయిపోయాయి. నెక్స్ట్ రజినీకాంత్ తో సినిమా, ఖైదీ 2, రోలెక్స్, విక్రమ్ 2, ప్రభాస్ సినిమాలు ఉన్నాయి. విక్రమ్ 2 సినిమా LCUకి ఎండ్ కార్డ్ అవనుంది. ఆ తర్వాత ప్రభాస్ తో లోకేష్ చేయనున్న సినిమా పదవ ప్రాజెక్ట్ అవుతుంది. ఇక్కడితో లోకేష్ చెప్పిన పది సినిమాలు అయిపోతాయి. ఆ తర్వాత ఇక లోకేష్ నిర్ణయం మార్చుకోని మళ్లీ డైరెక్షన్ చేయాలి అనుకుంటే తప్ప అప్పుడు లియో 2 గురించి ఆలోచించిస్తాడేమో.