Telisinavallu Teaser: కంటెంట్ కొత్తగా ఉంది అంటే ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందే ఉంటారు. కుమారి 21 ఎఫ్ సినిమా తరువాత హెబ్బా పటేల్ మరో హిట్ ను అందుకోలేదనే చెప్పాలి. స్పెషల్ సాంగ్స్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా విప్లవ్ కోనేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తెలిసినవాళ్ళు. సైరెన్ సినిమా బ్యానర్ పై విపులవ్ కోనేటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఢిల్లీలో జరిగిన మాస్ సూసైడ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరక్కించినట్లు తెలుస్తోంది. “హెబ్బా, కార్తీక్ ప్రేమించుకుంటారు.. కానీ హెబ్బా పెళ్ళికి ఒప్పుకోదు. ఎందుకు అని కార్తీక్ అడుగగా.. తాము ఇంకో నెలలో కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకొనున్నట్లు చెప్తుంది. ఎందుకు ఈ మాస్ సూసైడ్ అని అడుగగా.. తమ కుటుంబానికి పెద్ద.. తమ తాతగారిని బ్రతికించుకోవడం కోసం కుటుంబం అంతా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పడంతో అవాక్కయిన హీరో వారిని ఆ సూసైడ్ నుంచి కాపాడాలనుకుంటాడు. అయితే ఆ కుటుంబం ఎవరి మాట వినదని. ఒకవేళ వారు మాట వినాలి అంటే వారికి తెలిసినవాళ్ళు అయ్యి ఉండాలని డాక్టర్ చెప్పడంతో హీరో కార్తీక్ వారి ఇంటికి బయల్దేరతాడు.
మరి చివరకు కార్తీక్ ఈ మాస్ సూసైడ్ ను ఆపాడా..? కుటుంబాన్ని కాపాడాడా..? లేదా..? అసలు వారిని ఆత్మహత్యకు ప్రేరేపించిన శక్తి ఏంటి..? అనేది సినిమా చూసి తెలుసుకుకోవాల్సిందే. ఈ కథ మనం చాలాసార్లు వినేసి ఉన్నాం. మూఢ నమ్మకాలతో ఢిల్లీలోని ఒక కుటుంబం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.. ఆ ఘటనపై ఇప్పటికే చాలా డాక్యుమెంటరీలు వచ్చాయి. అందులో ఒకటి ది హౌస్ ఆఫ్ సీక్రెట్స్. దేశాన్నే గజగజలాడించిన ఈ ఘటనను తీసుకొని విప్లవ్ ఈ సినిమాను తీసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో మొత్తం స్టోరీని చూపించకుండా కొద్దిగా కల్పిత కథను యాడ్ చేసి లవ్ స్టోరీతో చూపించాలనుకునట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇక హెబ్బా, కార్తీక్ జంట మధ్య రొమాన్స్ ఫ్రెష్ గా కనిపిస్తోంది. చనిపోయిన కుటుంబ పెద్దగా నరేష్ కనిపించాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అదిరిపోయిందని చెప్పాలి. మరి ఈ సినిమాతో హెబ్బా ఏ రేంజ్ హిట్ ను అందుకుంటుందో చూడాలి.
https://www.youtube.com/watch?v=rJwlij330rI