'అల్లరి' నరేష్, విజయ్ కనకమేడల, షైన్ స్క్రీన్స్ కాంబినేషన్ లో వస్తున్న 'ఉగ్రం' నుండి టైటిల్ సాంగ్ విడుదలైంది. శ్రీచరణ్ పాకాల స్వర పరిచి, పాడిన ఈ పాటను చైతన్య ప్రసాద్ రాశారు.
శివ కందుకూరి, రాశిసింగ్ జంటగా నటించిన 'భూతద్దం భాస్కర్ నారాయణ' విడుదల వాయిదా పడింది. సి.జి. వర్క్ పూర్తి కాగానే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు.
ఇప్పటికే ఒకటి రెండు చిత్రాలలో కీ-రోల్స్ ప్లే చేసిన సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. 'క్షణం' ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ హీరోగా పి. విమల ఓ సినిమా నిర్మిస్తున్నారు.
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ నటిస్తున్న 'స్పై' చిత్రం సమ్మర్ స్పెషల్ గా రాబోతోంది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బి.హెచ్. దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
'చూసి చూడంగానే' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ. అతను హీరోగా నటించిన తాజా చిత్రం 'భూతద్దం భాస్కర్ నారాయణ' మార్చి 31న జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమా టీజర్ ను తేజ సజ్జా విడుదల చేశారు.
శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్ హీరోయిన్ గా రూపుదిద్దుకుంటున్న సినిమా 'భూతద్దం భాస్కర్ నారాయణ'. పురుషోత్తం రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా మార్చి 31న జనం ముందుకు రాబోతోంది.
Telisinavallu Teaser: కంటెంట్ కొత్తగా ఉంది అంటే ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందే ఉంటారు. కుమారి 21 ఎఫ్ సినిమా తరువాత హెబ్బా పటేల్ మరో హిట్ ను అందుకోలేదనే చెప్పాలి.