Film Chamber : హైదరాబాద్ లోని తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద తెలంగాణ వాదులు గొడవకు దిగారు. ఫిలిం ఛాంబర్ లో పైడి జయరాజ్ ఫొటో చిన్నగా పెట్టారని నిర్మాతల మండలి వద్ద సెక్రటరీ ప్రసన్న కుమార్ తో పాశం యాదగిరి వాగ్వాదానికి దిగారు. ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చారు. కావాలనే తెలంగాణకు చెందిన పైడి జయరాజు ఫొటోను చిన్నగా పెట్టారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ వాదులు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో గొడవ సద్దుమణిగింది.
Read Also : Kingdom : అతన్ని నాతోనే ఉంచుకోవాలని ఉంది.. విజయ్ కామెంట్స్
సినారే ఫొటో ఎందుకు పెట్టలేదంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై నిర్మాతల మండలి ఇంకా స్పందించలేదు. ఇండస్ట్రీ నుంచి ఎవరూ పెద్దగా రియాక్ట్ కాలేదు. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో తెలంగాణకు చెందిన వారిపై వివక్ష చూపిస్తున్నారంటూ చాలా మంది నిరసనలు చేపడుతున్నారు. ఇప్పుడు ఏకంగా నిర్మాతల మండలి వద్ద ఈ గొడవ సంచలనం రేపుతోంది.
Read Also : Prabhas : పవర్ ఫుల్ గా ఉంది.. మహావతార్ పై ప్రభాస్ ప్రశంసలు