నేడు రసవత్తరంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు. ఈ ఉదయం 8 గంటల నుంచి మొదలయిన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ లో భాగం అయిన ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి మొత్తం సభ్యులు 3,355 మంది ఈ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. అధ్యక్ష కార్యదర్శిల తో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులకు ఓటు…
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఎన్నికలు ఈ రోజు జరగబోతున్నాయి. చిన్న నిర్మాతలంతా మన ప్యానెల్ పేరుతో, పెద్ద నిర్మాతలంతా ప్రొగ్రెసివ్ ప్యానల్ పేరుతో పోటీపడుతున్నారు. గిల్డ్ పేరుతో కోట్లాది రూపాయల పరిశ్రమ సొమ్మును బడా నిర్మాతలు దోచుకుంటున్నారని చిన్న నిర్మాతలు ఆరోపిస్తుండగా…. ఈ ఎన్నికలు పదవుల కోసం కాదు అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమని ప్రొగ్రెసివ్ ప్యానల్ లో ఉన్న అగ్ర నిర్మాతలు వాదిస్తున్నారు. దీంతో మరోసారి ఛాంబర్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.…
పైరసీని అరికట్టడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు మీడియా సమక్షంలో తెలుగు చిత్ర పరిశ్రమ ధన్యవాదాలు తెలిపింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి రవి హైదరాబాద్ రాగా.. తెలంగాణ పోలీసులు అతడిని పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. రవి అరెస్ట్ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్‌మీట్‌లో టాలీవుడ్ సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు…
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో తెలంగాణ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. రవి చేతనే ఐబొమ్మ వెబ్‌సైట్‌ను పోలీసులు డిలీట్ చేయించారు. దాంతో సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, నిర్మాత సి కళ్యాణ్, ఛాంబర్ సెక్రటరీ ప్రసన్నకుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత…
తెలుగు సినీ పరిశ్రమలో గత రెండు వారాలుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె సంచలనంగా మారింది. తమ వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్‌లను నిలిపివేసి నిరసన తెలుపుతోంది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్‌తో పాటు 72 మంది యాక్టివ్ నిర్మాతలు పాల్గొననున్నారు.…
టాలీవుడ్ లో 12వ రోజు షూటింగ్స్ బంద్ కొనసాగుతోంది. ఫెడరేషన్ , ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు కూడా విఫలం అయ్యాయి. నిన్న నిర్మాతల కండీషన్స్ పై ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్ జనరల్ కౌన్సిల్ లో చర్చించారు కార్మిక సంఘాలు. మరోవైపు నిన్న ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు సమావేశం అయ్యారు. శనివారం సినీ కార్మికుల ఫెడరేషన్ నాయకులను మరోసారి చర్చలకు పిలిచే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. నిర్మాతలు అర్ధం లేని ప్రతిపాదనలు చేస్తు…
సినీ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ లో ఫెడరేషన్ కో ఆర్డినేషన్ మెంబర్స్ తో ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల చర్చలు జరపబోతున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి సూచనల తో చర్చలు జరుపనున్నారు. చర్చల అనంతరం సమ్మె పై ప్రకటన చేయనున్నారు ఇరు వర్గాలు. ఈరోజు జరిగే చర్చల్లో అంతిమంగా అందరికీ…
టాలీవుడ్ లో గత 9 రోజులుగా షూటింగ్స్ కు బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిన్న, మిడ్ రేంజ్ నుండి భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాంతో బిగ్ బడ్జెట్ సినిమాల నిర్మాతలకు భారీ నష్టాలు వస్తున్నాయి. ఎదో ఒకటి తేల్చాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ విషయమై కాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం కాబోతున్నారు నిర్మాతలు. నిర్మాతల సమావేశం అనంతరం ఫెడరేషన్ సమావేశం కాబోతుంది. Also Read : WAR 2…
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతన పెంపు డిమాండ్‌తో జరుగుతున్న సమ్మె వివాదంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్‌లో ప్రముఖ నిర్మాతలైన దిల్ రాజు, సుప్రియ, బాపినీడుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సినీ కార్మికుల సమ్మె, షూటింగ్‌ల నిలిపివేత వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. Also Read : Tollywood : ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రితో ముగిసిన నిర్మాతలు భేటీ.. నంది అవార్డ్స్ పై కీలక ప్రకటన సినీ కార్మికులు 30…
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల వేతనాల పెంపు అంశం గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)లో నిర్మాతల మండలి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో వేతన పెంపుపై తమ నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఈ సమావేశంలో పలు ఆంక్షలతో కూడిన కీలక నిర్ణయాలను ప్రకటించారు. వేతన పెంపు వివరాలు నిర్మాతల మండలి ప్రకటించిన నిర్ణయం ప్రకారం, రోజుకు 2000 రూపాయలు…