Film Chamber : హైదరాబాద్ లోని తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద తెలంగాణ వాదులు గొడవకు దిగారు. ఫిలిం ఛాంబర్ లో పైడి జయరాజ్ ఫొటో చిన్నగా పెట్టారని నిర్మాతల మండలి వద్ద సెక్రటరీ ప్రసన్న కుమార్ తో పాశం యాదగిరి వాగ్వాదానికి దిగారు. ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చారు. కావాలనే తెలంగాణకు చెందిన పైడి జయరాజు ఫొటోను చిన్నగా పెట్టారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ వాదులు. ఈ విషయం తెలుసుకున్న…
తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 2014 జూన్ రెండవ తేదీ వరకు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న కేసుల వివరాలు అందజేయాలని అన్ని జిల్లాల ఎస్పీలను కమీషనర్లను తెలంగాణ డీజీపీ ఆదేశించారు. అంతేకాకుండా.. 2009 మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి 2014 జూన్ రెండవ తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలు సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో.. త్వరలోనే తెలంగాణ ఉద్యమకారుల కేసులను…