Prabhas : హోంబలే సంస్థ తీసుకొచ్చిన ‘మహావతార నర్సిహా’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. త్రీడీలో తీసుకొచ్చిన ఈ యానిమేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు రానటువంటి త్రీడీ యానిమేషన్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తోంది. పైగా నర్సింహ స్వామి కథ కాబట్టి ప్రేక్షకులను విపరీతంగా ఎంగేజ్ చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది దీనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపించాడు. మహావతార నరసింహా ‘‘పవర్‌ఫుల్ విజన్‘ లాగా ఉంది. ఇంత మంచి సినిమాను తీసుకొచ్చిన హోంబలే సంస్థకు ఆయన విషెస్ తెలిపాడు.
Read Also : Anasuya : నడుము అందాలతో అనసూయ హల్ చల్..
‘యానిమేషన్ రూపంలో తీసుకొచ్చిన ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఇందులో కథ, స్క్రీన్ ప్లే, పాత్రలు, డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ డైరెక్టర్ అశ్విన్ కుమార్, మూవీ టీమ్ కు నా బెస్ట్ విషెస్’ అంటూ తెలిపాడు ప్రభాస్. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ యానిమేషన్ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ప్రస్తుతం స్కీన్లు కూడా పెంచుతున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో అవతారానికి సంబంధించిన మూవీని రిలీజ్ చేస్తామని ఇప్పటికే హోంబలే సంస్థ ప్రకటింది. ఇప్పుడు వచ్చిన నర్సింహ స్వామిది మొదటి మూవీ.
Read Also : Coolie : రజినీకాంత్ ‘కూలీ’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?