Surya – Karthi : తమిళ స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇద్దరూ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ మంచి హిట్లు అందుకున్నారు. సినిమాల్లో సంపాదించడమే కాకుండా చాలా మందికి సాయం చేస్తూ ఉంటారు వీరిద్దరూ. మొన్ననే సూర్య తన ఫౌండేషన్ కోసం ఏకంగా రూ.10 కోట్ల చెక్ ఇచ్చాడు. ఇప్పుడు అన్నదమ్ములు కలిసి ఓ డైరెక్టర్ కలను నెరవేర్చారు. కార్తి, అరవింద్ స్వామి కలిసి నటించిన మూవీ మెయ్యజగన్. దీన్నే తెలుగులో సత్యంసుందరం పేరుతో రిలీజ్ చేయగా.. మంచి క్లాసిక్ హిట్ అందుకుంది. ‘96’ ఫేమ్ ప్రేమ్ కుమార్ దీనిని డైరెక్ట్ చేశాడు. ప్రేమ్ కుమార్ ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్న కార్ ను తాజాగా సూర్య, కార్తి గిఫ్ట్ ఇచ్చేశారు.
Read Also : Team India Captain: జస్ప్రీత్ బుమ్రా కాదు.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే?
మహీంద్రా థార్ కారును తాజాగా సూర్య డైరెక్టర్ ప్రేమ్ కుమార్ కు అందజేశారు. ఈ ఫొటోను ప్రేమ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. ‘ఎప్పటి నుంచో నేను మహీంద్రా థార్ ను కొనాలని అనుకుంటున్నాను. 5 డోర్ వెర్షన్, వైట్ కలర్ కారు కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూశా. అది మార్కెట్ లోకి వచ్చిందని తెలుసుకుని అప్పటి వరకు దాచుకున్న డబ్బులతో కొందామని వెళ్లా.. కానీ డెలివరీ కావాలంటే ఏడాది టైమ్ పడుతుందన్నారు. అందుకే కొనలేదు. పైగా నా దగ్గరున్న డబ్బులు కూడా అయిపోయాయి. కానీ సూర్య, కార్తి కలిసి నా డ్రీమ్ కారును గిఫ్ట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. వారికి ఎప్పటికీ థాంక్స్ చెబుతూనే ఉంటా’ అని రాసుకొచ్చాడు.
Read Also : Team India Captain: జస్ప్రీత్ బుమ్రా కాదు.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే?