ఎలాంటి క్యారెక్టర్ ని అయినా ఈజ్ తో ప్లే చెయ్యగల హీరోల్లో ‘సూర్య’ ఒకడు. ఎక్స్పరిమెంట్స్ తో పాటు కమర్షియల్ సినిమాలని కూడా చేస్తూ మార్కెట్ పెంచుకుంటున్న సూర్య, పాన్ ఇండియా రేంజులో చేస్తున్న సినిమా ‘సూర్య 42’. ‘సిరుత్తే శివ’ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మూడో షెడ్యూల్ రీసెంట్ గా మొదలయ్యింది. శ్రీలంకలోని దట్టమైన అడవుల్లో ‘సూర్య 42’ షూటింగ్ గ్రాండ్ స్కేల్ లో జరుగుతోంది. వెయ్యేళ్ళ క్రితం కథతో, వార్ జనార్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. దాదాపు పది భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ గురించి ఎడిటర్ ‘నిషాద్ యూసఫ్’ హైప్ పెంచే కామెంట్స్ చేశాడు.
రీసెంట్ గా ‘తళ్లుమాల’ సినిమాకి ఎడిటర్ గా మంచి పేరు తెచ్చుకున్న నిషాద్ యూసఫ్, ‘సూర్య 42’ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… “ఈ మూవీ సెవెంత్ సెన్స్ ని మించి ఉంటుంది” అంటూ చెప్పాడు. ‘సూర్య 42’ గురించి ఈ మాటలు విన్న సూర్య ఫాన్స్ ఈ ఇంటర్వ్యూని వైరల్ చేస్తున్నారు. దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ‘సూర్య 42’ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యి సినీ అభిమానులని ఆకట్టుకుంది (#Suriya42MotionPoster) . మోషన్ పోస్టర్ లోని గ్రాఫిక్ వర్క్, దేవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సూర్య బ్యాక్ లుక్ మంచి ఫీడ్ బ్యాక్ ని తెచ్చుకున్నాయి.స్టూడియో గ్రీన్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘సూర్య 42’ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసమే సూర్య, వెట్రిమారన్ చేస్తున్న సినిమాని వాయిదా వేస్తూ వస్తున్నాడు. ‘వాడివాసిల్’ పేరుతో సూర్య, వెట్రిమారన్ కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూ ఉండడంతో, ‘వాడివాసిల్’ క్యాన్సిల్ అయ్యిందేమో అనే రూమర్స్ కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి.