దర్శక ధీరుడు రాజమౌళి కోపం ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. చాలామంది హీరోలు సెట్ లో జక్కన్న అరుస్తాడని బాహాటంగానే చెప్పారు. ఇక నేడు కర్ణాటకలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మొదటిసారి జక్కన్న కోప్పడడం హాట్ టాపిక్ గా మారింది. స్టేజిపైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతుండగా.. స్టేజి మీద ఉన్న బాడీగార్డ్స్ , డాన్సర్స్, పోలీసులు అందరు ఒక్కసారిగా గుమిగూడారు. దీంతో అక్కడ కొద్దిగా గందరగోళం ఏర్పడింది.
ఇక ఇది చూసిన ఆగ్రహం వ్యక్తం చేసిన జక్కన్న మైక్ తీసుకొని స్టేజి పైన ఉన్న బాడీ గార్డ్స్ ని, డాన్సర్స్ ని దిగిపొమ్మని అరిచారు. అంతేకాకుండా పోలీసులు తప్ప స్టేజిపైన ఎవరు ఉండకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకెవరికి ఇక్కడ బాడీగార్డ్స్ వద్దు.. వెళ్లిపోండి అంటూ గట్టిగా కేకలు వేయడంతో వారందరు స్టేజి దిగి వెళ్లిపోయారు. ఇక మొదటిసారి జక్కన్న కోపం చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.