Shobhitha Dhulipala: బాలీవుడ్ లో పాగా వేసిన అచ్చ తెలుగందం శోభితా ధూళిపాళ్ల. ఇంటగెలిచి రచ్చ గెలవాలి అన్న సామెతను ఈ చిన్నది తిరగరాసింది. రచ్చ గెలిచి ఇంట గెలవడానికి తెలుగులో అడుగుపెట్టింది. ఇక్కడ కూడా మంచి గుర్తింపునే అందుకొంటుంది. ఇక వరుస అవకాశాలతో ముందుకు దూసుకెళ్తున్న శోభిత పై ఇటీవలే కొన్ని రూమర్స్ వచ్చిన విషయం తెల్సిందే. అక్కినేని అందగాడు నాగ చైతన్యతో శోభిత డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు నొక్కివక్కాణిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ఈ జంట చెప్తున్నా తాము వారిద్దరిని కళ్లారా చూశామని బీ టౌన్ మీడియా కోడై కూస్తోంది.
ఇక ఇవన్నీ పక్కన పెడితే శోభితా ప్రస్తుతం ఒక గోల్డెన్ ఆఫర్ ను పట్టేసింది. టాలీవుడ్, బాలీవుడ్ కు కాకుండా హాలీవుడ్ కు చెక్కేస్తోంది. అవును..హాలీవుడ్ లో ఆమె నటించిన మొదటి చిత్రం మంకీ మ్యాన్. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్తున్నట్లు ఉన్నా ఫోటో శోభితా అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే తెలుగు నుంచి సమంత హాలీవుడ్ కు పయనమయ్యింది. మరి ఈ ముద్దుగుమ్మలు ఇద్దరు అక్కడ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.