Singer Mangli Gives Clarity On Stone Attack On Her Car News: కర్ణాటకలోని బళ్లారిలో తన కారుపై రాళ్ల దాడి జరిగిందన్న వార్తల్లో వాస్తవం లేదని తాజాగా సింగర్ మంగ్లీ స్పష్టం చేసింది. సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న ఆ వార్త నిజం కాదని తేల్చి చెప్పింది. ఆ ఈవెంట్ పెద్ద సక్సెస్ అయ్యిందని.. ఫోటోలు, వీడియోలు చూస్తే మీకే తెలుస్తుందని పేర్కొంది. తన కెరీర్‌లోని ఉత్తమ కార్యక్రమాల్లో ఇది ఒకటని, కన్నడ ప్రజలు తనకెంతో ప్రేమ చూపించారని తెలిపింది. నిర్వాహకులు సైతం తనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బాగా చూసుకున్నారని, అది మాటల్లో వర్ణించలేనని చెప్పుకొచ్చింది. కేవలం తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేందుకు ఇలాంటి ఫేక్ వార్తల్ని సృష్టిస్తారని, ఈ తప్పుడు ప్రచారాల్ని తాను ఖండిస్తున్నానని మంగ్లీ మండిపడింది.
Naga Babu: మంత్రి రోజాకు నాగబాబు కౌంటర్.. ఆమె గురించి మాట్లాడటం అంటే..?
కాగా.. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమం జరగ్గా, ఈ ఈవెంట్‌కి మంగ్లీ అతిథిగా హాజరైంది. ఆమెతో పాటు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని సైతం ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్ ముగిసిన అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో.. ఆమె కారుపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసినట్టు వార్తలొచ్చాయి. గతంలో ఓ ఈవెంట్‌లో కన్నడలో మాట్లాడాలని యాంకర్ రిక్వెస్ట్ చేసినా మంగ్లీ మాట్లాడలేదని, చివరికి యాంకర్ బలవంతం చేయడంతో కేవలం ఒకట్రెండు కన్నడ మాటలు మంగ్లీ మాట్లాడిందని, ఈ ఘటనతో కన్నడ ప్రేక్షకులు నొచ్చుకున్నారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే వాళ్లు రాళ్ల దాడి చేసినట్టు ప్రచారం జరిగింది. అయితే.. ఆ వార్తల్లో నిజం లేదని మంగ్లీ క్లారిటీ ఇచ్చేసింది.
Pakistan: పాక్‌లో హిందువులపై ఆగని అఘాయిత్యాలు.. హిందూ బాలిక కిడ్నాప్, అత్యాచారం
Mangli Clarity On Attack Ne