Singer Kenisha : తమిళ హీరో జయం రవి విడాకుల విషయం ఇప్పుడు రచ్చ రచ్చ అవుతోంది. రవిపై అతని భార్య ఆర్తి, అత్త కలిసి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి కేసు కోర్టులో ఉంది. అయితే సింగర్ కెనీషాకు జయం రవి మధ్య రిలేషన్ ఉందని.. ఆమె వల్లే తాము విడిపోతున్నాం అంటూ ఆర్తి స్వయంగా ఆరోపిస్తోంది. అప్పటి నుంచి కెనీషాకు బ్యాడ్ కామెంట్స్, ట్రోలింగ్ చివరకు బెదిరింపులు ఎక్కువయ్యాయంట. ఈ విషయాన్ని స్వయంగా కెనీషా సోషల్ మీడియాలో వెల్లడించింది.
Read Also : IndiGo Fligt Incident: ఇండిగో విమాన ఘటన.. పాక్‌కి సింధూ నీళ్లు ఆపడంలో తప్పే లేదు..
‘కొందరు నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. వాటి స్క్రీన్ షాట్లు నేను ఇక్కడ పోస్టు చేస్తున్నాను. నేను ఏ విషయాన్ని దాచుకోను. నన్ను ప్రశ్నించే హక్కు మీ అందరికీ ఉంది. కాబట్టి నేను దానికి రెడీగానే ఉన్నాను. నా చుట్టూ జరుగుతున్న కొన్ని విషయాలపై నన్ను ఇలా బెదిరిస్తున్నారు. నేను చేయని తప్పుకు నన్ను ఇలా నిందించడం కరెక్ట్ కాదు.
మీకు నేను తప్పు చేస్తున్నాను అనిపిస్తే నన్ను కోర్టులో పెట్టండి. అక్కడే నిరూపించుకుంటాను. అంతేగానీ ఇలా శాపనార్థాలు పెడుతూ కామెంట్లు పెట్టడం ఎందుకు. మీ వల్ల నేను ఎంతో మనోవేధన అనుభవిస్తున్నాను. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. నిజానిజాలు ఏంటనేది త్వరలోనే బయటకు వస్తాయి. అప్పటి వరకు నేనేమీ చేయలేను. తప్పు చేస్తే చట్టానికి కట్టుబడి శిక్ష అనుభవిస్తాను. అంతే తప్ప అస్సలు పారిపోయే వ్యక్తిని కాదు అప్పటి వరకు వేచి ఉండండి. ఇప్పటి నుంచే నన్ను నిందించకండి’ అంటూ తెలిపింది కెనీషా.
Read Also : Peddi Update: పెద్ది.. ఇది అస్సలు ఊహించలేదుగా?