Peddi Update: పెద్ది.. ఇది అస్సలు ఊహించలేదుగా?
- రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ పెద్ది
- విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న పెద్ది
- బుచ్చిబాబు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా పెద్ది రూపొందుతోంది. క్రికెట్‌తో పాటు ఎమోషన్ ఈ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. పెద్ది ఒకటి కాదు.. రెండు అని తెలుస్తోంది.
పెద్ది సినిమాను రెండు పార్టులుగా ప్లాన్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ, పెద్దిని మాత్రం బుచ్చిబాబు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఒకవేళ కథను ఒక్క పార్ట్‌లో చెప్పకుంటే.. సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉంది. లేదంటే ఒక్క భాగంతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని.. ఇప్పటికే ఫస్ట్ షాట్‌తో చెప్పేశాడు బుచ్చిబాబు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆఏర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read
Also Read: Shubman Gill: కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. ఓపెనర్‌గా రోహిత్ స్థానంలో ఎవరంటే?
ప్రస్తుతం పెద్ది సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ నుంచి లేటెస్ట్‌గా చరణ్ కొన్ని ఫోటోలు షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చరణ్‌తో పాటు మీర్జాపూర్ నటుడు దివ్యేందు శర్మ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కీలక సన్నివేశాలు చిత్రకరీస్తున్నారు. 2026 మార్చి 27న పెద్ది రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ అయిపోయేలోపు.. పెద్ది ఒకటా? రెండా? అనే క్లారిటీ రానుంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!