Siddu Jonnalagadda Intresting Comments: సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న ‘మ్యాడ్’ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ కీలక పాత్రలలో నటించారు. అక్టోబర్ 6న థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సిద్ధు జొన్నలగడ్డ అతిథిగా హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ సితార సినిమా అంటే నా సినిమా లాంటిదని, మొదట కళ్యాణ్ మ్యాడ్ స్టోరీ లైన్ నాకు చెప్పినప్పుడు, చాలా ఎంజాయ్ చేస్తూ ఇది ఖచ్చితంగా చేయాల్సిన సినిమా అని అప్పుడే అనిపించిందని అన్నారు.
Narne Nithin: ఎప్పుడూ నాకు సపోర్ట్ గా ఉన్నారు… థాంక్యూ బావ!
నితిన్, రామ్, సంగీత్, గౌరీ, అనంతిక, గోపిక.. లాంటి వారాంతా సితార బ్యానర్ నిర్మించిన సినిమాలో భాగం కావడం లక్కీ అని పేర్కొన్న ఆయన సితార వాళ్ళు సినిమా గురించి తప్ప ఖర్చు గురించి గానీ, టైం గురించి గానీ పట్టించుకోరని అన్నారు. ఇక చినబాబు గారు ఈరోజు మధ్యాహ్నం ఒక విషయం చెప్పారు, అది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదని అంటూనే మహేష్ ఫాన్స్ ఎంజాయ్ చేసే న్యూస్ ఒకటి సిద్దూ చెప్పుకొచ్చాడు. ఈరోజు గుంటూరు కారం సాంగ్ షూట్ నుంచి వచ్చారని, చినబాబు గారి గొంతులో నేను అంత ఎక్సైట్ మెంట్ చాలారోజుల తర్వాత విన్నానని పేర్కొన్న సిద్దూ సాంగ్ సూపర్ వచ్చింది, థియేటర్లు తగలబడిపోతాయని చినబాబు గారు అన్నారని చెప్పుకొచ్చారు.