Gas cylinder accident : వెస్ట్ బెంగాల్ లో దారుణం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలోని ప్రతిమా మండలం ధోలాఘాట్ గ్రామంలోని ఓ ఇంట్లో సోమవారం రాత్రి 9గంటల సమయంలో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు ఫైర్ ఇంజిన్ కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు…
Fire Accident : హైదరాబాద్‌లోని కోకాపేట GAR టెక్ పార్క్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు ఐటీ ఉద్యోగులకు తీవ్రగాయాలు కాగా, కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బిల్డింగ్‌లోని రెస్టారెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలినట్లు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్‌లో వందలాది మంది ఉద్యోగులు ఉండటంతో అప్రమత్తమైన అధికారులు వారిని వెంటనే తగిన చర్యలు తీసుకొని…
నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లెలోని గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. మంటలు వ్యాపించకముందే కుటుంబసభ్యులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అగ్నిప్రమాదం నేపథ్యంలో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ సర్గోధా జిల్లాలో శనివారం ప్యాసింజర్ వ్యాన్‌లోని గ్యాస్ సిలిండర్ పేలింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో కనీసం ఏడుగురు మరణించారు. 14 మంది గాయపడ్డారు.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో పెళ్లి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. భుంగ్రా గ్రామంలో గురువారం జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడులో ఐదుగురు వ్యక్తులు మరణించారు.
దీపావళి పండుగ వేళ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉగ్రకుట్ర జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం కోయబత్తూరులో ఉక్కడంలోని దేవాలయం సమీపంలో కారులో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.