ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న ఇప్పటికీ అంతే జోరు మీద దూసుకెళ్తూది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా.. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు .. గుర్తింపు పాత్రలు చేస్తోంది. మొన్నటి వరకు బాలీవుడ్‌లో బీజి గా ఉన్న ఈ చిన్నది, చాలా రోజుల తర్వాత తెలుగులో ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో అలరించడానికి సిద్ధం అవుతుంది. సూపర్ థ్రిల్లర్ మూవీ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదల కానుంది. అయితే..
తమన్న ఈ మధ్య స్పెషల్ సాంగ్ లు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రజనీకాంత్ మూవీ ‘జైలర్’లో ‘వా.. కావాలయ్యా.. దా.. దా..’ అంటూ ఐటమ్ సాంగ్‌లో ఒక ఊపు ఊపిన తమన్నా సోషల్ మీడియాను కుదిపేసిందనే చెప్పాలి. ఇక రీసెంట్‌గా ‘స్త్రీ 2’లో కూడా ఓ చిన్న పాత్రతో పాటుగా ‘ఆజ్ కీ రాత్..’ పాటలో సందడి చేసింది. ఈ పాట కూడా చాలా హిట్ తో పాటు మూవీ మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. దీంతో ఇప్పుడు ‘తమన్నా ఐటమ్ సాంగ్ చేస్తే సినిమా హిట్’ అనే సెంటిమెంట్ మొదలైందట. ఇందులో భాగంగా ఆమెకు మరో ఆఫర్ లభించింది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న ‘రైడ్-2’లో ఓ స్పెషల్ సాంగ్‌లో తమన్నా డ్యాన్స్ చేయనుంది. ఈ పాటలో హనీ సింగ్ కూడా ఉంటారని తెలుస్తోందట. కాగా ఇక ఈ పాటను ప్రమోషనల్ సాంగ్‌గా తెరకెక్కించనున్నారట.. అంతేకాదు ఈ మూవీకి ఈ పాట మరింత బూస్ట్ ఇస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.