బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లేటెస్ట్ సినిమా సికందర్. కోలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 200 కోట్లతో నిర్మించారు. భారీ అంచనాల మధ్య గత నెల 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. పాత చింతకాయ పచ్చడి కథ. ఓల్డ్ స్టైల్ మేకింగ్ అని నెటిజన్స్ సికిందర్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నారు. కలెక్షన్స్ కూడా ఆశించినతగా లేవు.
వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నసల్మాన్ ఖాన్.. ప్లాప్ సినిమాలతో కాలక్షేపం చేస్తున్న టాలీవుడ్ దర్శకుడుతో సినిమా చేయబోతున్నాడనే టాక్ అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ సర్కిల్స్ లోను వినిపిస్తోంది. గతేడాది మాస్ మహారాజ రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను డైరెక్ట్ చేసాడు హరీష్ శంకర్. బాలీవుడ్ సినిమా రైడ్ కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా దారుణ పరాజయాన్ని చూసింది. సినిమా బడ్జెట్ మొత్తంలో కనీసం 20 శాతం కూడా థియేటర్స్ నుండి రాబట్టలేక పోయింది. తన తరువాతి సినిమా టాలివుడ్ లో చేసేందుకు ప్రదక్షిణాలు చేసి చివరికి బాలీవుడ్ హీరోను సెట్ చేసాడని సినీ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుందని సమాచారం. అలాగే రీసెంట్లీ అమరన్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన తమిళ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామితో కండల వీరుడు కథ చర్చలు చేసాడని టాక్ నడుస్తోంది. మరి ఈ ఇద్దరిలో సల్లూ భాయ్ ముందుగా ఎవరితో వర్క్ చేస్తాడో చూడాలి.