Satyadev: టాలీవుడ్ లో కష్టపడి పైకి వచ్చిన వారిలో హీరో సత్యదేవ్ ఒకడు. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక స్టార్ హీరోగా ఎదిగాడు సత్యదేవ్. ఈ మధ్యనే గాడ్ ఫాదర్ సినిమాలో చిరుకు ధీటుగా విలనిజాన్ని పండించి అభిమానుల మనసులను చూరగొన్నాడు. ప్రస్తుతం వారు సినిమాలతో బిజీగా ఉన్న సత్యదేవ్ ను చూస్తే అసలు పెళ్లి కాలేదు అనుకునేవారు చాలామంది.. కానీ, సత్యదేవ్ కు పెళ్లి అయ్యి మూడేళ్ళ బాబు కూడా ఉన్నాడు. సత్యదేవ్ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఒకపక్క జాబ్ చేస్తూనే ఇంకోపక్క అవకాశాల కోసం తిరిగేవాడట. ఒక్కోసారి ఉదయం షూటింగ్ కు వెళ్లి.. రాత్రి మొత్తం పనిచేశావాడట. ఇక కొద్దీ కొద్దిగా ఆఫర్లు రావడం మొదలుపెట్టాకా జాబ్ ను వదిలేయమని, ఇంటి బాధ్యతలు తాను తీసుకొంటానని సత్య వైఫ్ దీపిక చెప్పడంతో జాబ్ ను వదిలి సినిమాలతోనే బిజీగా మారాడు.
Centenary Celebrations Of Ghantasala: అమెరికాలో ఘనంగా ఘంటసాల శతజయంతి ఉత్సవాలు
దీపికా, సత్యకు ఒక బాబు. అతని పేరు సవర్ణిక్. నేడు ఈ బుడతడి పుట్టినరోజు. దీంతో సత్య.. తన కొడుకు, భార్యతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ” సవర్ణిక్ మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్నాడు. నా ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫొటోలో సత్య లుక్ చూస్తుంటే గుర్తుందా శీతాకాలం సినిమా సమయంలో తీసినట్లు కనిపిస్తోంది. ఇక సవర్ణిక్ కు సత్యదేవ్ అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపడంతో పాటు అందమైన కుటుంబం.. ఫ్యామిలీ పిక్ అదిరింది గురూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు