కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన కిరణ్ అబ్బవరం సెకండ్ మూవీ ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ చక్కని విజయాన్ని అందుకుంది. అలానే ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అయ్యి వ్యూవర్స్ ప్రశంసలు పొందింది. విశేషం ఏమంటే… 2019లో ‘రాజా వారు రాణి గారు’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ‘సబాస్టియన్ పీసీ 524’, ‘సమ్మతమే’ చిత్రాలలో నటిస్తున్నాడు. అవి షూటింగ్ పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఇదిలా ఉంటే, శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ మరణానంతరం ఆయన కుమార్తె కోడి దివ్య చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. స్వర్గీయ కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కిరణ్ అబ్బవరం హీరోగా సినిమాను అతని బర్త్ డే సందర్బంగా ప్రకటించింది. ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరుగనుంది. కార్తీక్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Read also : అఫిషియల్ : “ప్రభాస్ 25” టైటిల్ అనౌన్స్మెంట్
కిరణ్ అబ్బవరంతో కోడి దివ్య నిర్మించబోతున్న సినిమాతో కన్నడ భామ సంజనా ఆనంద్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే ఆమె కన్నడంలో ఐదారు చిత్రాలలో నటించిన 2019లో ఆమె నటించిన ‘కెమిస్ట్రీ ఆఫ్ కరియప్ప’, ‘మాలే బిల్లు’ చిత్రాలు విడుదలై మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత ‘కుష్క’, ‘సాలగ’, ‘షోకీ వాలా’, ‘క్షత్రియ’, ‘విండో సీట్’ వంటి చిత్రాలలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఇందులో కొన్ని సినిమాల విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది. షార్ట్ ఫిల్మ్స్ నుండి సినిమాల్లోకి వచ్చిన సంజనా ఆనంద్ మధ్యలో ‘హనీమూన్’ అనే వెబ్ సీరిస్ లోనూ నటించింది. మరి కిరణ్ అబ్బవరం మూవీతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్న సంజనా ఆనంద్ కు ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి.