సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ సినిమాని చూసిన కొంతమంది సెలబ్రిటీస్ కబీర్ సింగ్ సినిమా వయొలెంట్ గా ఉందంటూ కామెంట్స్ చేసారు. ఈ మూవీని చూసిన కొంతమంది క్రిటిక్స్, వయోలెన్స్ ఎక్కువగా ఉందంటూ కామెంట్స్ చేశారు. లవ్ స్టొరీలో వయోలెన్స్ ఎక్కువగా ఉందని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ సందీప్ రెడ్డి వంగ వరకూ వెళ్లడంతో “కబీర్ సింగ్ సినిమాని వయొలెంట్ ఫిల్మ్ అంటున్నారు కదా అసలు వయొలెన్స్ అంటే ఎలా ఉంటుందో నా నెక్స్ట్ సినిమాలో చూపిస్తానని” స్ట్రెయిట్ గా చెప్పేసాడు. ఈ కామెంట్స్ విన్న వాళ్లు సందీప్ ఎదో క్యాజువల్ చెప్పాడు అనుకున్నారు కానీ అనిమల్ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత మాత్రం సందీప్ ఊరికే చెప్పలేదు, బాలీవుడ్ కి బొమ్మ చూపించబోతున్నాడు అనే విషయం అర్ధమవుతుంది.
పోస్టర్స్ నుంచి సాంగ్స్ వరకూ ప్రతి విషయంలో వైల్డ్ గా ఉన్న అనిమల్ ప్రమోషనల్ కంటెంట్… ట్రైలర్ రిలీజ్ తో పీక్స్ చేరబోతోంది. ఈరోజు అనిమల్ ట్రైలర్ రిలీజ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. మూడు నిమిషాల ముప్పై అయిదు సెకండ్ల నిడివితో ట్రైలర్ కట్ చేసిన సందీప్… గత రాత్రి సెన్సేషనల్ ట్వీట్ చేసాడు. “నెక్స్ట్ ఫిల్మ్ లో వయొలెన్స్ అంటే ఏంటో చూపిస్తా” అంటూ సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియోని పోస్ట్ చేస్తూ ఒక సినీ అభిమాని “హైప్ తో నిద్ర పట్టట్లేదు. ప్లీజ్ ట్రైలర్ రిలీజ్ టైమ్ చెప్పండి” అంటూ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ అండ్ అందులో వీడియో చూడగానే సందీప్ “ఈరోజు ప్రశాంతంగా పడుకోండి, అనిమల్ ట్రైలర్ చూసిన తర్వాత మీరు మీరు అసలు పడుకోరు” అంటూ ట్వీట్ చేసాడు. ఈ ఒక్క ట్వీట్ తో అనిమల్ వైల్డ్ నెస్ ట్రైలర్ నుంచే షురూ అవుతుందని తెలుస్తోంది. మరి ఆ రేంజ్ ట్రైలర్ ని ఏ టైమ్ కి రిలీజ్ చేస్తారో చూడాలి.
Sleep peacefully now..after watching the trailer…you won't anyway 😉#AnimalTrailer 🪓 https://t.co/FE2yFrU1uS pic.twitter.com/cqq2GtZTB9
— Animal The Film (@AnimalTheFilm) November 22, 2023