Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చే స్పిరిట్ కోసం ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో అనే అంచనాలు అప్పుడే ఊపందుకుంటున్నాయి. ఎందుకంటే ప్రభాస్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు తాము చేయబోయేది మరో ఎత్తు అని సందీప్ ఇప్పటికే భారీ హైప్ ఇచ్చాడు. అంతే కాకుండా మొదటి రోజే ఈ మూవీ ఎంత లేదన్నా రూ.150 కోట్లు వసూలు చేస్తుందని ఊరిస్తున్నాడు. ఇక తాజాగా సినిమా గురించి భారీ అప్ డేట్ ఇచ్చాడు సందీప్.
Read Also : Jagga Reddy: నా రాజకీయ జీవిత కథను నేనే రాసుకున్న..
ఈ మూవీ కోసం మెక్సికోలోని కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నట్టు తెలిపాడు. త్వరలోనే అక్కడ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నామన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ ఈ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఇప్పుడు ఫౌజీ, ది రాజాసాబ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ మూవీ షూటింగులు అయిపోయే సమయానికి స్పిరిట్ లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు సందీప్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నాడు. మూవీ రెగ్యులర్ షూటింగ్ కు ఇంకో ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. దసరాకు మూవీని ప్రారంభిస్తారని తెలుస్తోంది.