కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తన రాజకీయ జీవిత కథను స్వయంగా రాసుకున్నారని ప్రకటించారు. సినిమా టీజర్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన, హీరోలు ఎవరైనా ఇతరుల రాసిన కథల్లో నటిస్తారని, కానీ తాను నిజజీవితంలో పోలీసులను ఎదుర్కొన్నానని, ఫైట్లు చేశానని పేర్కొన్నారు. ఈ సినిమాలో తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను వేరే పాత్రల ద్వారా చూపించడంతో పాటు, తాను కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే తనపై ఎన్నో కుట్రలు జరిగాయని, తన రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కొన్న అనుభవాలను ఈ సినిమాలో ప్రతిబింబించనున్నట్లు చెప్పారు.
READ MORE: Guru Gochar 2025: ఈ 5 రాశుల వారికి “గురు గ్రహ” ఆశీర్వాదం.. ఇక అన్ని విజయాలే..
ఈ సినిమా కార్యాలయమే ఇకపై తన అడ్డాగా మారనుందని జగ్గారెడ్డి తెలిపారు. తన రాజకీయ జీవితం, పోరాటాలు, విజయాలు అన్నీ ఇందులో కనిపిస్తాయని చెప్పారు. టీజర్ పోస్టర్, వీడియోపై స్పందించిన ఆయన, తాను నటిస్తున్నది ఒరిజినల్ క్యారెక్టర్ అని, సినిమాలో చూపించబోయే ఘట్టాలన్నీ నిజ జీవిత సంఘటనలేనని అన్నారు. విద్యార్థి నాయకుడిగా, కౌన్సిలర్‌గా, మున్సిపల్ ఛైర్మన్‌గా తన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, ఒడిదొడుకులు అన్నీ ఈ సినిమాలో ఉంటాయని చెప్పారు. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ తానే స్వయంగా నిర్వహించానని జగ్గారెడ్డి వెల్లడించారు.
READ MORE: Kamareddy: చెరువులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మిస్టరీ డెత్!.. భర్తే ప్రాణం తీశాడా?