సౌత్ స్టార్ హీరోయిన్ సమంత టాటూలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ చాలాకాలం తరువాత అభిమానులతో టచ్ లోకి వచ్చింది. తాజాగా జరిగిన ఈ చిట్ చాట్ లో అభిమానులు అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది సామ్. థియేటర్ లో చూసిన ఫస్ట్ మూవీ ఏంటని ఓ అభిమాని ప్రశ్నించగా, “జురాసిక్ పార్క్” అని చెప్పింది సామ్. ఇక మొదటి సంపాదన ప్రస్తావన తీసుకురాగా, ఓ హోటల్‌లో హోస్టెస్‌గా ఎనిమిది గంటలు పని చేసి, రూ.500 అందుకున్నట్టు గుర్తు చేసుకుంది. అంతేకాదు “మీపైన మీరు నమ్మకం పెట్టుకోండి. మీ కలలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నించండి” అంటూ అమ్మాయిలకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది.
Read Also : Rana Daggubati : వైల్డ్… “కేజీఎఫ్-2” టీంపై ఇంట్రెస్టింగ్ ట్వీట్
ఎప్పటికైనా వేసుకోవాలన్న టాటూ ఏంటని ఓ అభిమాని అడగ్గా, తాను అసలు ఎలాంటి టాటూలు వేయించుకోకూడదని అనుకున్నట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మానుకోవాలని సలహా ఇచ్చింది. దీంతో సామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే గతంలో సామ్ తన మాజీ భర్తపై ప్రేమతో మూడు టాటూలు వేయించుకుంది. అందులో ఒకటి వైఎంసీ అనే అక్షరాలను వీపుపై, నడుము పై భాగంలో చై అనే పేరును, కుడి చేతి మీద రెండు యారో మార్కులను టాటూ వేయించుకుంది.