ఎక్కడ చూసినా “కేజీఎఫ్-2” గురించే టాక్. రికార్డ్స్ తో పాటు కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో కొల్లగొడుతున్నాడు రాఖీ భాయ్. ఈ సినిమాలో యష్ యాక్టింగ్, ప్రశాంత్ నీల్ టేకింగ్, అద్భుతమైన విజువల్స్, ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ అన్నివర్గాల ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకులు, విమర్శకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి “కేజీఎఫ్-2” టీంను సోషల్ మీడియా వేదికగా అభినందించారు.
Read Also : R Madhavan : స్విమ్మింగ్ లో సిల్వర్… అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన తనయుడు
“వైల్డ్ వైల్డ్ మెన్ మీరు మళ్లీ అద్భుతం చేశారు. యష్, ప్రశాంత్ నీల్ బాగా చేసారు. KGF టీం అందరికీ భారీ అభినందనలు” అంటూ రానా దగ్గుబాటి శాండల్‌వుడ్ మాగ్నమ్ ఓపస్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. కొన్ని రోజుల క్రితం రానా “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ హిట్ పై స్పందించిన విషయం తెలిసిందే. రానా నటించిన “విరాటపర్వం” విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ‘కేజీఎఫ్ 2’ విషయానికొస్తే… హోంబలే ఫిలింస్ మూవీని నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ సినిమాలో రవీనా టాండన్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రావు రమేష్, ప్రకాష్ రాజ్ కూడా నటించారు.
Wild wild men you’ll have done it again!! @TheNameIsYash @prashanth_neel well done 👏 huge Congratulations team #KGF 🔥🔥
— Rana Daggubati (@RanaDaggubati) April 17, 2022