టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గరనుంచి ఆమె సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్టడం.. అది కాస్తా వైరల్ గా మారడం జరుగుతుంది. తాజాగా మరోసారి సామ్ పోస్ట్ వైరల్ గా మారింది. ఈసారి పెళ్లి గురించి, అమ్మాయిల గురించి పోస్ట్ చేయడం మరింత చర్చకు దారితీసింది. ఆడపిల్లలను ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా పెంచాలని ఇండియా హాకీ టీమ్ కెప్టెన్ రాణి రాంపాల్ పోస్ట్ చేసిన ఒక పోస్ట్ ని సామ్ షేర్ చేసింది.
“మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అనేదానిమీద కంగారుపడకండి.. ఆమె పెళ్లికి దాచే డబ్బులను ఆమె చదువుకు ఉపయోగించండి. ఆమె కాళ్లపై ఆమె నిలబడేలా చేయండి. మొదట ఆమెను ఆమె ప్రేమించుకోవడం, ఆత్మస్థైర్యంతో ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడం నేర్చుకోనివ్వండి.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా భయపడకుండా నిలబడగలిగేలా జీవించడం నేర్పించండి” అని ఉన్న ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కొన్ని విషయాల్లో సామ్ పోస్ట్ లను వెటకారంగా తీసుకున్న నెటిజన్స్ ఈ పోస్ట్ విషయంలో మాత్రం సామ్ ని సపోర్ట్ చేస్తున్నారు. సామ్ చెప్పిన దానిలో తప్పేం లేదు.. బయట సమాజం అలాగే ఉంది.. అందరు తల్లిదండ్రులు అలాగే ఉన్నారని కామెంట్లు పెడుతున్నారు.