Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ ఈ సినిమాను ఎంతో జాగ్రత్తగా చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాలో రావణుడిగా సైఫ్ నటవిశ్వరూపం చూపించాడు. దీంతో దేవర సినిమాలో సైఫ్ విలనిజం హైలైట్ గా నిలుస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మధ్యనే ఒక పెద్ద షెడ్యూల్ ను పూర్తిచేసిన ఎన్టీఆర్ .. వెకేషన్ కు వెళ్లి వచ్చి మళ్లీ షూటింగ్ షురూ చేశాడు. ఇక ఈ షూటింగ్ కోసం సైఫ్ సైతం హైదరాబాద్ కు పయనమయ్యాడు. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ రావడానికి ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్న సైఫ్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Rajinikanth: అతను నీలాంబరి ముందు నరసింహా పరువు తీశాడు..
ఇక ఈ షెడ్యూల్ లో దేవర తో సైఫ్ ఫైట్ సీన్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. అంటే దేవరతో రావణుడు యుద్ధం మొదలుపెట్టే సమయం ఆసన్నమైనట్టే. దీంతో అభిమానులు ఈ షూటింగ్ కు సంబందించిన ఫోటోలను మేకర్స్ రిలీజ్ చేస్తే బావుండు అని కోరుకుంటున్నారు. దేవర సినిమా కొరటాలకు, ఎన్టీఆర్ కు ఎంత ముఖ్యమో అందరికి తెలుసు. ఆచార్య లాంటి భారీ పరాజయం తరువాత కొరటాల తెరకెక్కిస్తున్న సినిమా.. ఈ చిత్రంతో కొరటాల తానేంటో నిరూపించాలనుకుంటున్నాడు. ఇంకోపక్క ఎన్టీఆర్.. జక్కన్నతో సినిమా తరువాత ప్లాప్ ను అందుకోవడం తారక్ కు సెంటిమెట్ గా మారింది. ఇక ఈసారి ఆ సెంటిమెంట్ ను తారక్ బ్రేక్ చేయాలనీ చూస్తున్నాడు. అందుకే వీరు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.