సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అజ్నీష్ లోకనాథ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న విరూపాక్ష టీజర్ ని మేకర్స్ ఈరోజు సాయంత్రం 5 గంటలకి రిలీజ్ చెయ్యనున్నారు. నిజానికి మార్చ్ 1నే విరూపాక్ష టీజర్ రిలీజ్ కావాల్సి ఉండగా, సాయి ధరమ్ తేజ్ ఫాన్స్ ప్రెసిడెంట్ మరణించడంతో టీజర్ విడుదలని వాయిదా వేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విరూపాక్ష సినిమా టీజర్ ని లాంచ్ చేసి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చాడు. ఇప్పటికే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో బయటకి వచ్చిన విరూపాక్ష గ్లిమ్ప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Read Also: Mahesh Babu: ఏమున్నాడ్రా బాబు… సిక్స్ ప్యాక్ గ్యారెంటీ
ఈ గ్లిమ్ప్స్ సెట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ ని విరూపాక్ష టీజర్ మరింతగా పెంచితే, సినిమాపై బజ్ జనరేట్ అవుతుంది. థ్రిల్లర్ కథలకి బౌండరీలు ఉండవు కాబట్టి, కథలో విషయం ఉంటే సాయి ధరమ్ తేజ్ పాన్ ఇండియా హిట్ కొట్టడం పెద్ద కష్టమేమి కాదు. బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్న విరూపాక్ష మూవీ ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి రానుంది. మరి ఈరోజు రిలీజ్ కానున్న టీజర్, విరూపాక్ష సినిమా ప్రమోషన్స్ కి పాన్ ఇండియా స్థాయిలో సాలిడ్ స్టార్ట్ ఇస్తుందేమో చూడాలి.
Be all eyes to witness The Mystic World of #Virupaksha 👁🔥
Supreme Hero @IamSaiDharamTej's #VirupakshaTeaser Today @ 5PM.#VirupakshaOnApril21st #CourageOverFear@iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @BvsnP @aryasukku @bkrsatish @SVCCofficial @SukumarWritings pic.twitter.com/EmNKB636Yz
— SVCC (@SVCCofficial) March 2, 2023