సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కంబ్యాక్ సినిమాగా ప్రమోట్ అయిన ‘విరుపాక్ష’ మూవీ సెన్సేషనల్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఫస్ట్ 3 డేస్ లో 44 కోట్ల గ్రాస్ కి వసూల్ చేసిన విరుపాక్ష మూవీ, మండే టెస్ట్ కి సక్సస్ ఫుల్ గా పాస్ అయ్యింది. నైజాం నుంచి సీడెడ్ వరకూ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన విరుపాక్ష మూవీ బయ్యర్స్ కి ప్రాఫిట్స్ ఇస్తోంది. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీకి మౌత్ టాక్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. వైల్డ్ ఫైర్ లా మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతూ ఉండడంతో అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో విరుపాక్ష మేనియా నడుస్తోంది. ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ కి చేరువలో ఉన్న విరుపాక్ష సినిమాని మేకర్స్ మొదట్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేశారు. రిలీజ్ సమయానికి తెలుగుకి మాత్రమే స్టిక్ అయ్యి, ఇక్కడ హిట్ టాక్ కొట్టిన తర్వాత పాన్ ఇండియా రిలీజ్ కి ప్లాన్ చేశారు.
కాంతార సినిమా కూడా ఇలానే ముందు కర్ణాటక ప్రాంతంలో రిలీజ్ అయ్యి అక్కడ సెన్సేషనల్ టాక్ ని సొంతం చేసుకోని, ఆ తర్వాత ఇతర ప్రాంతాలకి స్ప్రెడ్ అయ్యింది. పాన్ ఇండియా హిట్ గా నిలిచిన కాంతార స్టైల్ లో ఇప్పుడు విరుపాక్ష సినిమా కూడా తెలుగులో సూపర్ హిట్ స్టేటస్ తెచ్చుకుంది కాబట్టి పాన్ ఇండియా రిలీజ్ కి టార్గెట్ చేస్తున్నారు. మే మొదటి వారంలో విరుపాక్ష సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం విరుపాక్ష సినిమాకి ఉన్న బజ్ ని వాడుకుంటూ వీలైనంత త్వరగా ఇతర భాషల్లోకి, ముఖ్యంగా హిందీలోకి విరుపాక్ష సినిమాని తీసుకోని వెళ్తే నార్త్ మార్కెట్ లో ఈ సినిమా వంద కోట్లు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మేకర్స్ ఈ విషయాన్ని కన్సిడర్ చేసి మే మొదటి శుక్రవారమే విరుపాక్షని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తే మంచి రిజల్ట్ ని రాబట్టే ఛాన్స్ ఉంది.
ఇంట గెలిచి రచ్చ గెలుద్దాం అని ఆగాం అతి త్వరలో అన్ని భాషల్లో విడుదల #Virupaksha
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 24, 2023