మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ ఉక్రెయిన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని స్టార్ హీరోలు ఎన్టీయార్, రామ్ చరణ్ ఒక రోజు అటూ ఇటూగా హైదరాబాద్ చేరుకున్నారు. అయితే బాలెన్స్ వర్క్ పూర్తి చేయడానికి డైరెక్టర్ రాజమౌళి బృందం ఉక్రెయిన్ లోనే ఉండిపోయింది. శుక్రవారంతో ఆ పనులు కూడా పూర్తి అయిపోయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే… ఇన్ స్టాగ్రామ్ లో ఉక్రెయిన్ లో పాల్గొన్న టోటల్ టెక్నికల్ టీమ్ తో కలిసి రాజమౌళి గ్రూప్ ఫోటో దిగాడు. అలానే ఈ సందర్భంగా తీసిన చిన్నపాటి వీడియోనూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. థ్రిల్లింగ్ సాంగ్ పిక్చరైజేషన్ కోసం రెండు వారాల పాటు ప్లాన్ చేసిన లాంగ్ షెడ్యూల్ ను ఉక్రెయిన్ లో పూర్తి చేశామని ఈ సందర్భంగా ఇన్ స్టాలో పేర్కొన్నారు. అయితే… ముందుగా అనుకున్నట్టుగా ఈ యేడాది అక్టోబర్ 13న ‘ట్రిపుల్ ఆర్’ మూవీ విడుదల కాకపోవచ్చుననే వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ భారీ చిత్రాన్ని హడావుడిగా విడుదల చేసేకంటే… జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేస్తే బెటర్ అని చిత్ర దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అదే జరిగితే ఈ మూవీని మరింత గొప్పగా జక్కన చెక్కుతాడనేది వాస్తవం!