నైజాంలో థియేటర్స్ కేటాయింపుల రచ్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఒకప్పడు నైజాం అంటే దిల్ రాజు అనే సిచుయేషన్. కానీ ఇప్పుడు రింగ్ లోకి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ వచ్చి చేరింది. సింగిల్ స్క్రీన్స్ ను లీజ్ కు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇక ఆసియన్ సురేష్ వాళ్ళు ఎలాగూ ఉండనే ఉన్నారు. రెగ్యులర్ డేస్ లో అంతా సజావుగానే సాగుతుంది కానీ స్టార్ హీరోల సినిమాలు, పండగ రిలీజ్ టైమ్ లో థియేటర్స్ పంచాయితీ వస్తోంది. ఎదో ఒక సినిమాకు అన్యాయం జరుగుతుంది. రేపు రిలీజ్ కానున్న రాబిన్ హుడ్, ఎంపురాన్, వీర ధీర సూరన్, మ్యాడ్ స్క్వేర్ విషయంలో థియేటర్స్ తలనొప్పి మొదలైంది.
నితిన్ రాబిన్ హుడ్, విక్రమ్ వీర ధీర సూరన్ మైత్రీ రిలీజ్ చేస్తుండగా. ‘మ్యాడ్ స్క్వేర్’ ఎంపురాన్ ను దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. ఇటీవల దిల్ రాజు రిలీజ్ చేసిన కోర్ట్ ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అన్ని ముఖ్య కేంద్రాల్లో మూడవ వారం కూడా ఆ సినిమాను రన్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లో రాబిన్ హుడ్ కు చాలా అంటే చాలా తక్కువ స్క్రీన్స్ దొరికాయి. వాటి సంఖ్య కాస్త పెంచమని మైత్రీ డిమాండ్. సినిమాలకు అడ్డా అయిన ప్రసాద్ ముల్టీప్లెక్స్ లో మైత్రీ సినిమాలు వేయరు. సో సింగిల్ స్క్రీన్స్ లో తమ సినిమాకు ఎక్కువ కావాలని కోరుతుంది మైత్రి. ఆర్టీసీ క్రాస్ రోడ్ వంటి ఏరియాలో ‘ఎంపురాన్’ ను సప్తగిరి థియేటర్ కేటాయించారు అంటే అర్ధం చేసుకోవచ్చు థియేటర్స్ వ్యవహారం ఎలా ఉందో. ఈ ఒక్కరోజు మాత్రం ఎంపురాన్ కు నైజాంలో భారీగా థియేటర్స్ దొరికాయి, రేపటి నుండి ఎలా అన్న దానిపై డిస్కషన్స్ జరుగుతున్నాయి చూడాలి ఎవరికీ ఎన్ని దొరుకుతాయో.