నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాబిన్ హుడ్. డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. గత కోనేళ్ళుగా నితిన్ హిట్ లేక సతమవుతున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని తనకు భీష్మ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుములు నమ్ముకున్నాడు. స్టార్ హీరోల కోసం ప్రయత్నించి లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకీ కుడుముల స్ట్రాంగ్ హిట్ కొట్టి తానేంటో నిరూపించుకోవాలని ఉన్నాడు. మార్చి 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న రాబిన్ హుడ్ పై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.
తాజాగా రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు చేసిన కామెంట్స్ నితిన్ ఫ్యాన్స్ ను కాస్త ఇబ్బంది పెట్టాయి. వెంకి కుడుముల మాట్లాడుతూ ‘ రాబిన్ హుడ్ సినిమాకు ఈ స్థాయిలో బజ్ రావడానికి రెండే రెండు కారణాలు. ఒకటి అదిదా సర్ప్రైజ్ సాంగ్. ఈ సాంగ్ చేసినందుకు కేతికకు చాలా థాంక్స్. అలాగే ఈ సినిమాలో ఒక ఇంటర్ నేషనల్ స్టార్ కావాలిఅనుకున్నప్పుడు వార్నర్ అయితే బాగుండు అని చెప్పాను. మా నిర్మాతలు వెంటనే వార్నర్ తో మాట్లాడి తీసుకు వచ్చారు. వార్నర్ కారణంగా ఈ సినిమాకు హ్యుజ్ బజ్ వచ్చింది’ అని అన్నారు. నితిన్, శ్రీలీల కాలేజీలు చుట్టేస్తూ ప్రమోషన్స్ చేస్తుంటే గెస్ట్ రోల్ చేసిన వారివలన బజ్ వచ్చిందనడం హీరో, హీరోయిన్స్ ను అవమానించినట్టని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.