Renu Desai: ఈ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ పోస్టర్స్.. సినిమా అప్డేట్స్ లేవని నిరాశపడుతున్న అభిమానులకు అకీరా ఫోటోల వలన కొత్త ఉత్తేజం వచ్చింది. ఉద్యమ నుంచి అకీరా నందన్ ఫొటోస్ తో సోషల్ మీడియా షేక్ అవుతుంది. మెగా సంక్రాంతి సంబురాల్లో పవన్ వారసుడే హైలైట్ గా నిలిచాడు. కోర మీసం, ఆరడుగుల హైట్, తండ్రి పోలికలతో.. వింటేజ్ పవన్ కళ్యాణ్ ను గుర్తుచేస్తున్నాడు. ఇక తన చెల్లి ఆద్యను ఏడిపిస్తూ.. అకీరా ఆడుకుంటున్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అంతేనా వీరిద్దరితో పవన్ కళ్యాణ్ ఫోటోను యాడ్ చేసి.. ఫ్యాన్స్ ఇంకా ఆనందపడుతున్నారు. ఇకపోతే ఈ ఆనందమైన క్షణాలను రేణు దేశాయ్ .. సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అన్నచెల్లెల అనుబంధాన్ని గుర్తుచేయాలంటే.. ఎవరైనా పవన్ నటించిన అన్నవరం సినిమానే చెప్పుకొస్తారు. అన్నయ్యా అన్నావంటే ఎదురవనా.. అనే సాంగ్ ఎంతటి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ అన్నాచెల్లెళ్ల అల్లరి పనులను ఒక వీడియో రూపంలో ఎడిట్ చేసి.. ఆ వీడియోకు అన్నయ్యా అన్నావంటే ఎదురవనా సాంగ్ ను యాడ్ చేసి రేణు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ” ఇక ఆఖరికి రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో వాళ్ల నాన్న పాట జరుగుతోంది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నిజం చెప్పాలంటే.. ఆ వీడియోకు ఈ సాంగ్ పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యింది అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.