Renu Desai: మెగా ఫ్యామిలీ ఇంట ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగితేనే కుటుంబం మొత్తం తరలివస్తుంది. అల్లు- మెగా కుటుంబాలు రెండు ఒక్కటిగా కనిపిస్తాయి. ఆ వేడుకలో కచ్చితంగా పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ పిల్లలు అకీరా, ఆధ్య కూడా పాల్గొంటారు. రేణు.. మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నా కూడా పిల్లలను మాత్రం మెగా ఫ్యామిలీకి దగ్గరగానే ఉంచుతుంది. పవన్ తో ఎంత బాండింగ్ అయితే ఉందో.. మెగా ఫ్యామిలీకి కూడా పిల్లలకు అంతే బాండింగ్ ఏర్పరుస్తుంది. ఇక నిహారిక పెళ్ళిలో కూడా అకీరా, ఆధ్య కూడా సందడి చేశారు. ఈ పెళ్లిలోనే పవన్ నలుగురు పిల్లలను చూడగలిగారు అభిమానులు. ఇక వరుణ్ పెళ్లిలో కూడా అలాంటి ఫ్యామిలీ పిక్ వస్తుంది అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ, ఆ ఆశలను అడియాశలు చేసింది రేణు.
Salaar: డార్లింగ్ రావడమే లేట్.. ప్రమోషన్స్ షురూ..?
వరుణ్ పెళ్ళికి తాము వెళ్లడం లేదని తెలిపింది. నిహారిక పెళ్ళికి పిల్లలను పంపించిన రేణు.. వరుణ్ పెళ్ళికి పిల్లలను కూడా పంపడం లేదని చెప్పుకొచ్చింది. “నిహారిక పెళ్లికి నేను వెళ్లలేదు. పిల్లల్ని పంపించాను. వరుణ్ తేజ్ నా కళ్ల ముందే పెరిగాడు. అతడికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అయితే వరుణ్ పెళ్లికి వెళ్తే అక్కడ అందరూ నన్ను చూసి అన్‌కంఫర్టబుల్‌గా ఫీలవుతారు. అకీరా, ఆధ్య కూడా వరుణ్ పెళ్లికి వెళ్లట్లేదు” అని చెప్పుకొచ్చింది. దీంతో పవన్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. రేణు ఎలాగూ రావడం లేదు.. కనీసం పిల్లలను అయినా పంపించవచ్చు కదా అని అభిమానూలు కామెంట్స్ పెడుతున్నారు.