Salaar: ఆదిపురుష్ తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం సలార్. కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషం ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఎన్నో వాయిదాల తర్వాత సలార్.. డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఏ సినిమా అయినా కూడా ప్రస్తుతం ప్రమోషన్స్ లేకుంటే జనాల మధ్యకు వెళ్లడం జరగని పని. అందుకే మేకర్స్.. ప్రమోషన్స్ పైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు. ఇక ఆదిపురుష్ సమయంలో ప్రభాస్.. ప్రమోషన్స్ లో ఓ రేంజ్ లో పాల్గొన్నాడు. దీంతో సలార్ కు కూడా డార్లింగ్ ఇదే రేంజ్ లో పాల్గొంటే బావుంటుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Shefali Shah: నేను చచ్చినా ఆ హీరోకు తల్లిగా చేయను..
ప్రస్తుతం ప్రభాస్.. మోకాలి సర్జరీ కోసం విదేశాల్లో ఉన్న విషయం తెల్సిందే. అందుతున్న సమాచారం ప్రకారం.. నవంబర్ ఫస్ట్ వీక్ లో ప్రభాస్ ఇండియా రానున్నాడు. డార్లింగ్ వచ్చిన తరువాత ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇంకోపక్క హీరో లేని సీన్లు కొన్ని మళ్లీ షూట్ చేసారని టాక్ నడుస్తోంది. దీంతో ఇంకా సలార్ షూట్ అవ్వలేదా.. ? అనే అనుమానం అభిమానుల్లో వస్తుంది. ఈ షూట్ ఇక్కడితో ఆగిందా.. ? ఇంకా ఉందా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఉంటే .. డిసెంబర్ వరకు అవుతుందా.. ? ప్రమోషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది చూడాలి. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.