Raviteja : మాస్ మహారాజ్ రవితేజ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా ఆయన కొత్త డైరెక్టర్లను పరిచయం చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ మాస్ జాతర. మనదే ఇదంతా అనేది ట్యాగ్ లైన్. అయితే ఈ మూవీ నుంచి తు మేరా లవర్ అనే సాంగ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో స్పెషల్ ఏముంది అనుకోకండి. రవితేజ 2002లో నటించిన ఇడియట్ మూవీ ఎంత సెన్సేషన్ అనేది తెలిసిందే. ఆ సినిమాలో చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే అనే పాట అప్పట్లో యూత్ ను ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్ లోని స్టెప్పులను తాజాగా తు మేరా లవర్ సాంగ్ లో వేశాడు. అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
Read Also :Anchor Ravi : నేను హిందువునే.. నాపై ట్రోలింగ్ ఆపండి ప్లీజ్ : యాంకర్ రవి
రైటర్ భాను భోగవరపును ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నారు. నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరియోల్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 14న ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. చాలా కాలం తర్వాత రవితేజ తన పాత సినిమాలోని ఫేమస్ స్టెప్స్ వేయడంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇది చూసిన వారంతా వింటేజ్ రవితేజ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని మూవీ టీమ్ భావిస్తోంది. రవితేజకు హిట్ పడి చాలా రోజులు అవుతోంది. ధమాకా తర్వాత మరోసారి శ్రీలీలతో నటిస్తున్నాడు. కాబట్టి హిట్ సెంటిమెంట్ గట్టిగానే పెట్టుకున్నాడు.