Anchor Ravi : యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే. ఓ ఛానెల్ షోలో చేసిన సీన్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. నందీశ్వరుడిని, హిందూ దేవుళ్లను అవమానించారు అంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్, విమర్శలు రావడంతో రవి ఇప్పటికే క్షమాపణలు చెప్పాడు. అయినా సరే ట్రోలింగ్ ఆగట్లేదు. దీంతో తాజాగా మరో వీడియోను రిలీజ్ చేశాడు. ‘నేను హిందువునే. పొద్దున లేస్తే దేవుళ్లకు మొక్కుతా. ఛత్రపతి శివాజీని ఫాలో అవుతాను. నా మతాన్ని నేను కించపరిచే వ్యక్తిని కాదు. నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నారు. మీకు నా గురించి తెలుసు. నేను ఎప్పుడూ ఇలాంటివి చేయలేదు. చేయబోను కూడా ‘ అంటూ చెప్పాడు.
Read Also : Esha Gupta : రొమాంటిక్ సీన్లు చేయడానికి సిగ్గెందుకు.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
‘సినిమాలోని సీన్ ను మేం స్పూఫ్ చేశాం. అంతే తప్ప కావాలని మేం స్వయంగా స్క్రిప్టు రాసుకుని చేసింది కాదు. కానీ కొన్ని మీడియా సంస్థలు వ్యూస్ కోసం తప్పుగా థంబ్ నెయిల్స్ పెడుతున్నాయి. కాబట్టి వాళ్లు చెప్పేది నమ్మకండి. నేను హిందూ మతాన్ని అమితంగా ప్రేమిస్తాను. నా దేశాన్ని కూడా అమితంగానే ప్రేమిస్తాను. ఇలాంటి తప్పులు ముందు ముందు జరగకుండా చూసుకుంటాను.. దయచేసి ట్రోలింగ్ ఆపండి. జై శ్రీరామ్..’ అంటూ తెలిపాడు యాంకర్ రవి. సుధీర్, యాంకర్ రవి కలిసి మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా సినిమాలోని గుడిలో నంది మీదుగా హీరోయిన్ ను చూసే సీన్ ను స్పూఫ్ చేశారు. అది కాస్త విమర్శలకు దారి తీసింది. నందీశ్వరుడిని అవమానించారు అంటూ హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దెబ్బకు రవి దిగొచ్చి క్షమాపణలు చెప్పాడు. కానీ సుధీర్ మాత్రం ఇంకా స్పందించలేదు.