Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాషన్ కు బ్రాండ్ అంబాసిడర్. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ముద్దుల భర్త. స్టార్ హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సినిమాల గురించి పక్కన పెడితే రణవీర్ ఒకరి కోసం బతకడు. ఎవరు ఏమనుకున్నా.. ఎన్ని ట్రోల్స్ వచ్చినా వాటిని వదిలేసి తాను అనుకున్నదే చేస్తాడు. ముఖ్యంగా ఫ్యాషన్ ను ఫాలో అవ్వడంతో రణవీర్ ను మించిన వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. సిగ్గు, బిడియం లేకుండా తనకు నచ్చిన డ్రెస్ ను వేసుకొని కనిపిస్తాడు. ఎన్నోసార్లు నెటిజన్స్ ట్రోల్స్ చేసినా వాటిని అస్సలు పట్టించుకోకుండా తన ఫ్యాన్స్ సెన్స్ ను కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. ఇక మరోసారి తన ఫ్యాషన్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. వింత వింత డ్రెస్ లతో ఇప్పటివరకు ఆకట్టుకున్న రణవీర్ తాజాగా న్యూడ్ గా దర్శనమిచ్చాడు.
ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఫోటోషూట్ చేశాడు. దీంతో ప్రస్తుతం రణవీర్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపొతే ఈ ఫోటోషూట్ ను హాలీవుడ్ హంక్ బర్ట్ రేనాల్డ్స్ కు నివాళిగా అర్పించాడు రణవీర్. 1972లో కాస్మొపాలిటన్ మ్యాగజైన్ కోసం పాప్ ఐకాన్ బర్ట్ రెనాల్డ్స్ నగ్నంగా పోజులిచ్చిన విషయం విదితమే. అప్పట్లో ఈ ఫోటోషూట్ పెద్ద సంచలనమే రేపింది.. ఇక రెనాల్డ్స్ కు నివాళిగా రణవీర్ ఆయన పోజును కాపీ కూడా కొట్టారు. ఒక రష్యన్ రగ్గు మీద నగ్నంగా పోజులిచ్చాడు. డిఫరెంట్ భంగిమలతో తాన్ దేహ సౌందర్యాన్ని చూపించాడు. ఇక ఈ ఫోటోషూట్ గురించి రణవీర్ మాట్లాడుతూ తనకు నగ్నంగా ఉండడంలో భయపడాల్సిన అవసరం లేదని, 1000 మంది ఉన్నా కూడా సిగ్గు లేకుండా నగ్నంగా ఉండగలనని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ ఫోటోషూట్ ద్వారా తన పబ్లిక్ స్టేటస్ కానీ, స్టార్ ఇమేజ్ కానీ అడ్డు రావని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఫోటోలపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మీమ్స్ రూపంలో దీపికా కు సెటైర్స్ వేస్తున్నారు.