మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే బుచ్చిబాబు సనతో రామ్ చరణ్ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే RC16గా అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ ప్రీప్రొడక్షన్స్ వర్క్స్ శరవేగంగా జరుగుతోంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి ఫ్రీ అవ్వగానే RC 16 రెగ్యులర్ షూటింగ్ చేసేలా బుచ్చిబాబు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒక విలేజ్ కథని పాన్ ఇండియా స్థాయిలో చెప్పనున్న ఈ చిత్ర యూనిట్ అనౌన్స్మెంట్ నుంచే బజ్ జనరేట్ చేస్తోంది. రెహమాన్ మ్యూజిక్ ఇవ్వనున్నాడు అనే విషయం బయటకి రావడంతో RC 16 రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు RC 16 రేంజ్ మరింత పెంచుతూ జైలర్ సినిమా స్టార్ కాస్టింగ్ లిస్టులో జాయిన్ అవ్వనున్నాడు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో ‘నరసింహా’గా సూపర్బ్ రోల్ ప్లే చేసాడు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్. రజినీ సినిమాలో రజినీనే డామినేట్ చేయడం అంత ఈజీ కాదు, అలాంటి విషయాన్ని జస్ట్ ఒక్క చుట్టూ తాగుతూ స్లో మోషన్ లో నడుచుకుంటూ వచ్చి చేసి చూపించాడు శివన్న. గాడ్ లెవల్ రేంజ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో శివన్న జైలర్ సినిమా క్లైమాక్స్ ని ఇంకో లెవల్ కి తీసుకోని పోయాడు. దీంతో శివన్నకి చిన్న క్యామియోతోనే పాన్ ఇండియా క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్న శివన్న… ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాలో కూడా నటించే ఛాన్స్ ఉంది., డిస్కషన్స్ జరుగుతున్నాయి అని రివీల్ చేసాడు. శివన్న రామ్ చరణ్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాను అని చెప్పగానే మెగా అభిమానులు, శివన్న అభిమానులు సోషల్ మీడియాలో రామ్ చరణ్, RC 16, శివన్న ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు.